కర్నూలు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఆదోనిలోని జిన్నింగ్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అయితే ఈ ఘటనలో సుమారు రూ.4 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







