ఒకచోట మనం జాబ్ చేస్తున్నామంటే మన భవిష్యత్ ఆ కంపెనీ మీద ఆ బాస్ మీదే ఆధారపడి ఉంటుంది.అయితే మనం జాబ్ చేసే చోట ఒక్కో బాస్ ఒక్కో రకంగా ఉంటారు.
కొందరు చాలా సీరియస్ గా ఎప్పుడూ పని పని అంటూ చావగొడుతుంటారు.మరి కొందరేమో ప్రతి చిన్న దానికి సీరియస్ అవుతుంటారు.
ఇంకొందరేమో ఫ్రెండ్లీగా ఉంటారు.ఇలా ఒక్కొక్క బాస్ ఒక్కో విధంగా తమ కింద పనిచేసే వారితో ప్రవర్తిస్తూ ఉంటారు.
అయితే మనం అప్పుడప్పడు కొందరు విభిన్నమైన బాస్ ల గురించి కూడా తెలుసుకుంటాం.వారు తమ కింద పనిచేసే వారికి ఎంతో ఖరీదైన సర్ ప్రైజ్ గిఫ్ట్‌లు ప్లాన్ చేస్తుంటారు కదా.
ఇప్పుడు కూడా మనం ఇలాంటి ఓ లేడీ బాస్ గురించే తెలుసుకోబోతున్నాం.ఆమె తన ట్యాలెంట్తో సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్న ఆమె తన కింద పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా ఎంతో బాధ్యతతో చూసుకుంటున్నారు.
తన సంస్థ లాభాల్లో నడిచిందంటే దానికి కారణం వర్కర్లే అని అందుకే వారికి అత్యంత విలువ ఇస్తున్నట్టు ఆమె చెబుతున్నారు.ఇందులో భాగంగా వారికి అనగా ఒక్కో ఉద్యోగికి సుమారు 10వేల డాలర్ల వరకు అంటే మన దేశంలో రూ.7.5లక్షలు దాకా గిఫ్ట్ ప్యాకేజీ కింద ప్రకటించేసి సంచలనం సృష్టించింది.

ఇలా ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు ఏకంగా 500 మందికి ఇలాంటి భారీ గిఫ్ట్ ప్యాక్‌ను ప్రకటించేసింది.స్పాంక్స్ యజమానురాలు అయినటువంటి సారాబ్లేక్సీ ఇలంటి సంచలన నిర్ణయం తీసుకుంది.రీసెంట్ గా ఆమె బ్లాక్‌స్టోన్ కంపెనీ నుంచి అధిక శాతంలో వాటాను కొనుగోలు చేయగా అవి కాస్తా భారీగా లాభాలు తెచ్చిపెట్టేశాయి.అయితే ఇలా లాభాలు రావడంలో వర్కర్లు, ఉద్యోగుల బాధ్యత ఎక్కువగా ఉందని కాబట్టి వారికి లాభాలను సమానంగా పంచాలనుకుంది.
ఇదే విషయాన్ని మంచి పార్టీ ఏర్పాటు చేసి మరీ ప్రకటించేసింది.