ఆ ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతున్న విజయ్..?

భారత్ లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కొన్ని రంగాలపై ప్రత్యక్షంగా, మరికొన్ని రంగాలపై పరోక్షంగా ప్రభావం చూపిన సంగతి తెలిసిందే.కరోనా ప్రభావం ఎక్కువగా పడిన రంగాల్లో సినిమా రంగం కూడా ఒకటి.

 Hero Vijay Meets Tamilanadu Cm Palaniswami About Theatre Seating Rules,kollywood-TeluguStop.com

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లకు అనుమతులు ఇచ్చినా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ కావడం వల్ల సినిమాలకు షేర్ ఎక్కువగా రావడం లేదు.ఫలితంగా స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించే నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని థియేటర్లపై ఆంక్షలు తొలగించాలని కోరారు.థియేటర్లపై ఆంక్షల అమలు వల్ల సినిమా నిర్మాతలు భారీగా నష్టపోతున్నారని విజయ్ అభిప్రాయపడ్డారు.

త్వరలో విజయ్ నటించిన మాస్టర్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా విడుదల కానుండగా జనవరి 7వ తేదీ నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభం కానుంది.

Telugu Kollywood Vijay, Master, Palaniswamy-Movie

విజయ్ కు జోడీగా మాళవికా మోహన్ ఈ సినిమాలో నటిస్తుండగా లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకునిగా వ్యవహరిస్తున్నారు.విజయ్ తమిళనాడు సీఎం పళనిస్వామిని కలిసి 100 శాతం ప్రేక్షకులను థియేటర్లలోకి అనుమతించాలని అభ్యర్థించారు.ఈ అభ్యర్థన పట్ల తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కేంద్రం 50 శాతం నిబంధనల గురించి ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది.

మరోవైపు ఇతర సినిమా ఇండస్ట్రీల నుంచి సైతం ఇదే తరహా విజ్ఞప్తులు వ్యక్తమవుతున్నాయి.అయితే మరికొన్ని రోజుల్లో కేంద్రం థియేటర్ల సీటింగ్ విషయంలో నిబంధనలు సడలించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.50 శాతం సీటింగ్ తో థియేటర్లను కొనసాగిస్తే థియేటర్ల మనుగడకే ప్రమాదమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 50 శాతం సీటింగ్ నిబంధన కొనసాగితే టికెట్ రేట్లను భారీగా పెంచాలని థియేటర్ల ఓనర్లు భావిస్తున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube