తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ షో( Bigg Boss 7 ) తాజాగా గ్రాండ్గా మొదలైన విషయం తెలిసిందే.షో ప్రారంభంలోనే పోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.
ఇక ఎంట్రీ ఇవ్వడంతోనే రూల్స్ మొత్తం మారిపోతాయి ఉల్టా పుల్టా అంటూ ఎంట్రీ లోనే హౌస్ పై అంచనాలను అమాంతం చేశారు.ప్రేక్షకులు కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో రూల్స్( Bigg Boss House Rules ) అలాగే గేమ్స్ అని ఎలా ఉండబోతున్నాయి అన్నది తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి రెండవ కంటెస్టెంట్ గా ఇచ్చారు ఎంట్రీ ఇచ్చారు నటుడు, హీరో శివాజీ.
ఎంట్రీ ఇవ్వడంతోనే స్టేజ్ పైనే ఎమోషనల్ అయిపోయారు.హోస్ట్ నాగార్జున( Nagarjuna ) శివాజీ లైఫ్ జర్నీ గురించి చెబుతుంటే శివాజీ ఎమోషనల్ అయ్యారు.హైదరాబాద్ కి ఎంట్రీ ఇచ్చి మనలో అవకాశాలు దక్కించుకున్నారు.
అలా ఎన్నో అవస్థలు అవమానాలు కష్టాలు పడి ఒక్కొక్క మెట్టు వెతుకుతూ టాలీవుడ్ లో హీరోగా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.అయితే ఈ సందర్భంగా బిగ్ బాస్ స్టేజ్ పై ఎవరితో తెలియని ఒక విషయాన్ని నాగార్జునతో పంచుకున్నారు శివాజీ( Shivaji Life Journey ).
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ఫస్ట్ రెమ్యూనరేషన్ చెక్ ఇచ్చింది నాగార్జునే అని తెలిపారు.సీతారాముల కళ్యాణం చూతము రారండి లో శివాజీ నటించారు.
వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రాన్ని నాగార్జున నిర్మించారు.
నీ లైఫ్ లో ఉల్టా పుల్టా మూమెంట్ ఏంటి అని అడగగా.నా లైఫ్ నాకు తెలియదు అని శివాజీ అన్నారు.హైదరాబాద్ కి బతకడానికి వచ్చాను.
ఇలా మీముందు ఉన్నా అని అన్నారు.ఆ తర్వాత శివాజీ తన బాల్యంలో వాళ్ళ అమ్మతో ఉన్న ఫోటోని నాగ్ చూపించడంతో వెంటనే శివాజీ తన తల్లి ఫోటో చూసి ఎమోషనల్ అయ్యారు.
అమ్మ పేరు చెబితే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అని తన పేదరికం గురించి తెలిపాడు.అమ్మ మా ఊళ్ళో చిన్నప్పుడు కోడి పిల్లలని పెంచుతూ వాటిని అమ్మి మా కోసం పండక్కి బట్టలు కొనేది అని శివాజీ చెబుతున్న విషయాలు అందరిని ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాయి.
ఇలా ఎంట్రీ ఇవ్వడంతోనే తన లైఫ్ లో జరిగిన చాలా విషయాలను చెప్పి ఏడిపించేశారు శివాజీ.