టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా కూడా మారాడు రామ్ చరణ్.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు.
అయితే ఇండియన్ 2 కారణంగా ఈ సినిమాకు బ్రేక్ పడింది.కాగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ విడుదల చేయలేదు.
దీంతో రామ్ చరణ్ అభిమానులు దర్శకుడు శంకరి దసరా సినిమాకు అయినా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేస్తాడా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాకు కష్టాలు బ్రేక్ పడటంతో రామ్ చరణ్ తన తదుపరి సినిమాలపై దృష్టిలో పెట్టాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ సినిమా తరువాత గౌతం తిన్న నూరి తో కలసి రామ్ చరణ్ ఒక సినిమాని చేయబోతున్నాడు.ఈ సినిమాను యువీ క్రియేషన్స్ ఎన్ వీఆర్ సినిమా బ్యానర్ లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నట్టుగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

కానీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇప్పటివరకు ఎటువంటి అప్ డేట్ కూడా బయటికి రాలేదు.దీనితో రామ్ చరణ్ తన 16వ సినిమాని గౌతం తిన్న నూరితో కాకుండా కన్నడ దర్శకుడు నర్తన్ తో చేయబోతున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నప్పటికీ అటు రాంచరణ్ కానీ ఇటు గౌతమ్ కానీ స్పందించడం లేదు.దీంతో గౌతం తిన్న నూరి రామ్ చరణ్ ని పక్కన పెట్టేసినట్లే వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.