ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది.ఈ రోజు సాయంత్రం వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది.
సోమవారం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.అయితే, వైసీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ వేయనున్నారని తెలుస్తోంది.
మరోవైపు టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపకపోవచ్చనే అనుమానాలు ఉన్నాయి.దీంతో సభలో ఉన్న బలాబలాల నేపథ్యంలో ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.
డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేయడంతో ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే.







