ప్రముఖ నటి కరాటే కళ్యాణి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.చేసింది తక్కువ సినిమాలే అయినా పలు సందర్భాల్లో వివాదాల ద్వారా, వివాదాస్పద అంశాల ద్వారా కరాటే కళ్యాణి వార్తల్లో నిలిచారు.2001 సంవత్సరంలో కరాటే కళ్యాణి నటిగా కెరీర్ ను మొదలుపెట్టగా సినిమాసినిమాకు ఆమెకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.అయితే తాజాగా ఒక సందర్భంలో కరాటే కళ్యాణి బోల్డ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
కరాటే కళ్యాణి కొన్ని సినిమాలలో బోల్డ్ రోల్స్ లో నటించగా కృష్ణ, మిరపకాయ్ సినిమాలలోని పాత్రలు ఆమెను ఊహించని స్థాయిలో పాపులర్ చేశాయి.అయితే తాను గతంలో చేసిన పాత్రల వల్ల తనపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని కరాటే కళ్యాణి భావిస్తున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మరోవైపు కరాటే కళ్యాణి రాజకీయాల్లో సక్సెస్ కావాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

కరాటే కళ్యాణి బిగ్ బాస్ షోలో పాల్గొన్నా ఆ షో ఆమెకు మైనస్ అయిందే తప్ప ఏ మాత్రం ప్లస్ కాలేదనే విషయం తెలిసిందే.తాజాగా ఒక సందర్భంలో కరాటే కళ్యాణి మాట్లాడుతూ తాను పురాణాలు, హరికథలు చెప్పినా తగిన గుర్తింపు రాలేదని అప్పుడు నాకు రాని గుర్తింపు సినిమాలలో చేసిన పాత్రల ద్వారా వచ్చిందని ఆమె అన్నారు.నేను పైట జార్చితే మాత్రమే ప్రేక్షకులు నన్ను ఆదరించారని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు.

వ్యాంప్ తరహా పాత్రల ద్వారా నాకు దక్కిన గుర్తింపు విషయంలో హ్యాపీగా ఫీల్ కావాలో బాధగా ఫీల్ కావాలో అర్థం కావడం లేదని కరాటే కళ్యాణి వెల్లడించారు.అయితే కరాటే కళ్యాణి కామెంట్లపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ మధ్య కాలంలో ఆమెకు సరైన సినిమా ఆఫర్లు రావడం లేదు.రాజకీయాలలో కరాటే కళ్యాణి ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.