సోషల్ మీడియాలో అనునిత్యం ఎన్నో రకాల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.అయితే అందులో కొన్ని రకాల వీడియోలు మాత్రమే నెటిజన్లను నవ్విస్తాయి, కవ్విస్తాయి, ఆశ్చర్య పరుస్తాయి.
మరికొన్ని వీడియోలను చూసినపుడు వీటికి సంబంధం లేకుండా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.తాజాగా అలాంటి వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది.
తాజాగా ఒక తల లేని కుక్క ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.విషయం ఏమంటే ఈ కుక్కకు కాలు కూడా లేకపోవడం.
అవును, అలాంటి ఓ విచిత్రమైన ఫోటో ఒకటి ఇపుడు వైరల్‌గా మారింది.
కాగా ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ ఇదేక్కడి విచిత్రం నాయనా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.వైరల్ అవుతున్న చిత్రాన్ని చూస్తే.కుక్క తల భాగం కట్ చేసి మొండానికి మాత్రం కుట్లు వేసినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
అలా చేస్తే కుక్క బతికే వుంటుందా? అనే అనుమానం వస్తుంది కదా.కానీ అది బతికే ఉందని అది కూర్చొని ఉన్న విధానం చూస్తేనే అర్థం అవుతుంది.ఇదేలా సాధ్యం? కాగా సోషల్ మీడియాలో దీనిని చూసినవారు ఇదంతా నిజమేనని నమ్మరు.అయితే ఇక్కడ నిజం మరోకటి ఉంది.
అదేమంటే, దగ్గరగా చూస్తే కుక్కకి కాలు కూడా లేకపోవడం గమనించవచ్చు.నిజం ఏమిటంటే, ఈ కుక్క కాలు మాత్రమే కత్తిరించబడింది, మిగతావన్నీ భద్రంగా ఉన్నాయి.ఈ చిత్రాన్ని తీసిన సమయంలో, కుక్క తన ఎడమ వైపున వంగి తన శరీరాన్ని నాలుకతో నాకుతోంది.ఈ సమయంలో దాని తల మొత్తం శరీరంతో కప్పబడి ఉన్నట్టు కనబడింది.
ముందు కనిపించే కుట్టిన భాగం దాని కాలు మాత్రమే అని అర్ధం చేసుకోండి.కాగా ఈ ఫోటో తీసిన ఫోటో గ్రాఫర్ క్రియేటివిటీ వలన అది అలా కనిపించింది.
ఈ కుక్కకు సంబంధించిన ఓరిజినల్ ఫోటో కూడా ఆ పక్కనే చూపించారు చూడండి.కుక్క కాలు మాత్రమే తెగిపోయి మిగిలిన శరీరం సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.