ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల వెరైటీ వంటకాలు బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి.వెరైటీ ఫుడ్ కాంబినేషన్స్ తో నేటిజన్ల మతులు పోగొడుతున్నారు కొంతమంది చెఫ్లు.
వింత వింత వంటకాలను వండేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త బాగా వైరల్ అవుతున్నాయి.కొన్ని కొన్ని వంటకాలను నేటిజన్స్ బాగానే ఇష్టపడుతున్నారు కానీ.
, మరికొన్నిటిని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.ఆ వెరైటీ ఫుడ్ కాంబినేషన్స్ వంటకాలు చూసి ఆహార ప్రియులు సైతం వామ్మో అని పెదవి విరుస్తున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వెరైటీ వంటకం బాగా వైరల్ అవుతుంది.ఈ రెసిపీని చూసి నేటిజన్స్ అవాక్ అవుతున్నారు.చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు.ఎంతో ఇష్టంగా ఐస్ క్రీమ్ ను లోట్టలేసుకుంటూ మరి లాగించేస్తారు.
ఐస్ క్రీమ్ లో చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి కదా.మరి మీలో ఎవరికన్నా గ్రీన్ చిల్లీ ఐస్‌క్రీమ్ గురించి తెలుసా.ఏంటి పేరు వినగానే షాక్ అయినట్లు ఉన్నారు.పచ్చిమిర్చితో ఐస్ క్రీమ్ ఏంటి అనా.? ప్రస్తుతం ఈ ప్రయోగాన్ని చూసి ఐస్‌క్రీమ్ ప్రియులు సైతం షాక్ అవుతున్నారు.
వైరలవుతోన్న ఈ వీడియో ప్రకారం ఒక దుకాణదారుడు మూడు నాలుగు పచ్చి మిరపకాయలను తీసుకుని ముక్కలు ముక్కలుగా చేస్తాడు.ఆ తర్వాత పచ్చి మిర్చి ముక్కలపై నుటెల్లా, మిల్క్ క్రీమ్ తో పాటు మరిన్ని ఇతర పదార్థాలను కూడా వేసి బాగా మిక్స్ చేసి దానిని ఐస్‌క్రీం రోల్స్‌ను తయారుచేస్తాడు.ఆ తర్వాత ఐస్ క్రీమ్ రోల్స్ ను కొద్దిసేపు ఫ్రీజర్లో ఉంచి కొంతమంది లేడీస్ కస్టమర్లకు సర్వ్ చేస్తాడు.
ఆ రోల్స్ సర్వ్ చేసేముందు కూడా ఐస్ క్రీమ్ పై పచ్చిమిర్చి గార్నిష్ చేసి మరి ఇస్తాడు.అది తిన్న కొందరు లేడీస్ హావభావాలు చూస్తే విచిత్రంగా ఉంటాయి.
ఈ వెరైటీ వంటకాన్ని చూసి ఐస్‌క్రీం ప్రియులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.కావలనంటే ఈ వీడియోపై ఒక లుక్ వేయండి.