జుట్టు రాలే సమస్యకు సుగంధద్రవ్య నూనెను ఎలా ఉపయోగించాలి?  

hair loss treatment essential oil -

ప్రతి అమ్మాయి జుట్టు అందంగా పొడవుగా ఒత్తుగా పెరగాలని కోరుకుంటుంది.జుట్టు రాలుతూ ఉంటే చాలా బాధపడతారు.

సాధారణంగా ప్రతి రోజు సుమారుగా 100 వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి.ఆలా కాకుండా ఎక్కువగా వెంట్రుకలు రాలిపోతూ ఉంటే అప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

జుట్టు రాలే సమస్యకు సుగంధద్రవ్య నూనెను ఎలా ఉపయోగించాలి-Telugu Health-Telugu Tollywood Photo Image

ఆ జాగ్రత్తలను తీసుకోకపోతే జుట్టు రాలే సమస్య అధికం అవుతుంది.జుట్టు రాలే సమస్యను సుగంధ ద్రవ్యాలతో తగ్గించుకోవచ్చు.

సుగంధ ద్రవ్యాలను ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.

ఈ చిట్కాకు లావెండర్ సుగంధ నూనె,కొబ్బరి నూనె అవసరం అవుతాయి.ఎక్స్ ట్రా వర్జిన్ కొబ్బరినూనెను మాత్రమే వాడాలి.ఎందుకంటే తక్కువ ప్రాసెస్ చేసిన నూనెలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.

ఎక్స్ ట్రా వర్జిన్ అంటే తక్కువ ప్రాసెస్ చేసినదని అర్ధం.

కొబ్బరినూనెలో యాంటీ ఆక్సిడెంట్లు,బ్యాక్టీరియా వ్యతిరేక, ఫంగస్ వ్యతిరేక లక్షణాలు ఉండుట వలన తల మీద ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

జుట్టుకి అన్ని నూనెల్లో కన్నా కొబ్బరినూనె మంచిది.

కొబ్బరినూనెలో కొన్ని చుక్కలు లావెండర్ సుగంధ నూనె కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగు అయ్యి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేసి ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.ఈ విధంగా చేస్తే చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితం కనపడుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hair Loss Treatment Essential Oil Related Telugu News,Photos/Pics,Images..