అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) మరోసారి అధ్యక్ష బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ నామినేషన్‌ను అధికారికంగా పొందిన ఆయన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
అయితే కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కులతో ట్రంప్ పోరాడాల్సి వస్తోంది.ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘ రాజ్యాంగం కోసం జైలుకు వెళ్లడం చాలా గర్వంగా వుంది ’’ అంటూ వ్యాఖ్యానించారు.
హుష్ మనీ ట్రయల్ ( Hush money trial ).మూడవ వారం విచారణ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా ఏదైనా ప్రస్తావించబడితే.
వారు ఎవరో మీకు తెలిస్తే.అతను నన్ను జైలులో పెట్టాలనుకుంటున్నాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అది ఏదో ఒక రోజు జరుగుతుందని.కానీ మన రాజ్యాంగం కోసం జైలుకు వెళ్లడం చాలా గర్వంగా వుంటుందని ట్రంప్ అన్నారు.
మాజీ అమెరికా అధ్యక్షుడు .న్యాయమూర్తి జువాన్ మెర్చాన్‌ను ( Judge Juan Mercon )ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన తీరు రాజ్యాంగ విరుద్ధమని.అలాంటిది ఎప్పుడూ చూడలేని ట్రంప్ అన్నారు.తన మాజీ ఫిక్సర్.మైఖేల్ కోహెన్‌పై ( Michael Cohen )గ్యాగ్ ఆర్డర్ విధించడానికి మెర్చాన్ నిరాకరించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
వారు కోరుకున్నది అంతా చెప్పగలరని.కానీ తాను ఎవరి గురించైనా చెప్పడానికి అనుమతి లేదు, ఇది అవమానకరమని ట్రంప్ ఫైర్ అయ్యారు.
ఇదే సమయంలో ద్రవ్యోల్బణంపై అధ్యక్షుడు జో బైడెన్‌పై ట్రంప్ మండిపడ్డారు.విచారణ ప్రక్రియను న్యూయార్క్ నగరానికి, న్యూయార్క్( New York ) రాష్ట్రానికి , మనదేశానికి చీకటి రోజుగా ట్రంప్ అభివర్ణించారు.కానీ శుభవార్త ఏమిటంటే.మా పోల్ సంఖ్యలు ఎన్నడూ లేనంత అత్యధికంగా వున్నాయని ప్రజలు అర్ధం చేసుకున్నారని మాజీ అధ్యక్షుడు అన్నారు.తాను మరో వారం పాటు ప్రచారానికి దూరంగా వుండటమే హాస్యాస్పదంగా వుందని ఆయన పేర్కొన్నారు.