కోలీవుడ్ స్టార్ హీరో విజయ్( vijay) తన టాలెంట్ తో ఎన్నో భారీ విజయాలను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.సినిమా సినిమాకు విజయ్ రేంజ్ పెరుగుతుండగా రెమ్యూనరేషన్ పరంగా కూడా విజయ్ టాప్ లో ఉన్నారు.
విజయ్ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.విజయ్ పాలిటిక్స్ లో కూడా సక్సెస్ సాధించాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
తమిళనాడులో విజయ్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది.
విజయ్ ఒకవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సేవా కార్యక్రమాల విషయంలో సైతం ఈ స్టార్ హీరోకు ఎవరూ సాటిరారనే సంగతి తెలిసిందే.తమిళనాడు( Tamil Nadu) రాష్ట్రంలో ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తే మొదట స్పందించే హీరోగా స్టార్ హీరో విజయ్ కు పేరుంది.గతేడాది 600కు 600 మార్కులు సాధించిన నందిని అనే విద్యార్థినికి విజయ్ డైమండ్ నెక్లస్ ను బహుమతిగా ఇవ్వడం జరిగింది.
గతేడాది విజయ్ 2000 మంది విద్యార్థులకు సహాయం చేశారు.ఈ ఏడాది జూన్ నెల 22వ తేదీన హీరో విజయ్ తన పుట్టినరోజు ( Vijay birthday)వేడుకలను జరుపుకోనున్నారు.గతేడాది 234 నియోజకవర్గాల్లో టాప్3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించిన విజయ్ ఈ ఏడాది కూడా విద్యార్థులకు సాయం చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.విజయ్ మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
విజయ్ లాంటి హీరోలు అరుదుగా ఉంటారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తన సంపాదనలో కొంత మొత్తాన్ని విజయ్ సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు.
విజయ్ లాంటి హీరోలు రాజకీయాలలో సైతం సులువుగా సక్సెస్ సాధిస్తారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సినిమా సినిమాకు విజయ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.
విజయ్ సినిమాలకు దూరం కాకూడదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.