ఇంతకీ.. కుప్పంలో బాబు గారి పరిస్థితేంటి ? 

మరో రెండు రోజుల్లో జరుగునున్న ఏపీ ఎన్నికల్లో గెలవడం టిడిపి, జనసేన, బిజెపి కూటమి పార్టీలకు ఎంత అత్యవసరమో వారిని ఓడించడం అంతే ముఖ్యం అన్నట్లుగా వైసిపి వ్యవహరిస్తోంది.వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తూనే, తమ రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికలు ఓడించేందుకు వైసిపి వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తోంది.

 What Is Chandrababu Naidu Situation In The Kuppam Constency , Nara Lokesh, Tdp,-TeluguStop.com

దీనిలో భాగంగానే టిడిపి అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంపై చాలా కాలం నుంచి ఫోకస్ పెట్టింది.అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి( Peddireddy Ramachandra Reddy )కి బాధ్యతలను అప్పగించి చంద్రబాబు ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూనే వస్తుంది.

వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లను గెలవకుండా చేసి వారిని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా  చూసే విధంగా వైసిపి వ్యూహాలు పన్నుతోంది.ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ నుంచి చంద్రబాబు వరుసగా గెలుస్తూనే వస్తున్నారు.

అయితే ఈసారి మాత్రం పరిస్థితులు కాస్త తారుమారు అయినట్టుగానే కనిపిస్తోంది.చంద్రబాబు( Chandrababu Naidu )ను ఓడించేందుకు వైసిపి వ్యూహాలు రచిస్తూ ఉండగా, ఆయన గెలుపు కోసం నందమూరి, నారా ఫ్యామిలీ లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.

Telugu Janasena, Janasenani, Mlc Srikanth, Bhuvaneswari, Lokesh, Pavan Kalyan-Po

ఈ విధంగా టిడిపి, వైసీపీలు పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.మరో రెండు రోజుల్లో జరగనున్న పోలింగ్ లో కనీసం లక్ష ఓట్లను టిడిపి టార్గెట్ గా పెట్టుకుంది.వైసిపిని గెలిపించే బాధ్యత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు.1989 నుంచి వరుసగా ఇక్కడ టిడిపి గెలుస్తూనే వస్తుంది.కానీ 2024 ఎన్నికల్లో మాత్రం కాస్త ప్రతికూలంగా పరిస్థితులు మారాయి.దీం తో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి( Nara Bhuvaneswari) సైతం ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్ వేసిన తర్వాత తన సోదరులతో కలిసి కుప్పంలో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Telugu Janasena, Janasenani, Mlc Srikanth, Bhuvaneswari, Lokesh, Pavan Kalyan-Po

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ వైసిపి పై చేయి సాధించడం, చంద్రబాబును అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో టిడిపి కాస్త కంగారుపడుతుంది.టిడిపి ఎమ్మెల్సీ శ్రీకాంత్ తో పాటు స్థానిక నేతలను సమన్వయం చేసే బాధ్యతలను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తీసుకున్నారు.లక్ష ఓట్ల టార్గెట్ గా అందర్నీ సమన్వయం చేస్తున్నారు.రెండు రోజుల క్రితం కుప్పం రామకుప్పం శాంతిపురం మండలాల్లో భువనేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.తమ చివరి శ్వాస వరకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటామని భువనేశ్వరి సెంటిమెంట్ ను రగిల్చే పనిలో ఉన్నారు.అయితే ఈసారి ఎన్నికల్లో గతంలో మాదిరిగా చంద్రబాబు గెలుపు నల్లేరు మీద నడక మాదిరిగా ఉండదు అన్నట్టుగానే ఇక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube