బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్( Salman Khan ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సికందర్.మురగదాస్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
చాలాకాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.ఇకపోతే ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.28 ఏళ్ల హీరోయిన్ 58 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయడం ఇదే మొదటిసారి.
ఇంతవరకూ యంగ్ హీరోలతో కలిసి నటించింది.తొలిసారి సీనియర్ స్టార్ తో నటించబోతోంది రష్మిక.మరి ఈ ఫెయిర్ తెరపై ఎలా ఉంటుందో చూడాలి మరి.అయితే వాస్తవానికి ఈ చిత్రంలో నటించాల్సింది రష్మిక కాదని నయనతార అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది.సల్మాన్ సరసన నయనతార అయితే బాగుంటుందని మురగదాస్( Murugadoss ) ముందుగా ఈ స్టోరీ నయనతార కే చెప్పారట.
అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ నయనతార ( Nayanthara )ఈ సినిమాను రిజెక్ట్ చేశారట స్టోరీ నచ్చకన, పాత్ర నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసిందా? అన్నది తెలియదు గానీ మురగదాస్ మాత్రం చాలా కన్విన్స్ చేసాడుట.
కానీ నయన్ ససేమేరా అనడంతో ఆ స్థానంలో రష్మికని ఒప్పించినట్లు వినిపిస్తుంది.స్టోరీ నచ్చకపోతే ఎంతపెద్ద స్టార్ అయినా.ఎన్ని కోట్లు ఆపర్ చేసినా నయనతార నిర్మొహమాటంగా నో అనేస్తుంది.
గతంలో నయన్ రిజెక్ట్ చేసిన సినిమాలెన్నో ఉన్నాయి.సికందర్ కూడా అలా మిస్ చేసుకున్న అవకాశంగా కొందరు భావిస్తున్నారు.
స్టోరీ ,పాత్ర నచ్చితే సీనియర్ హీరో అయినా ఎస్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.ప్రస్తుతం ఆమె కొంత మంది సీనియర్ హీరోలతో కలిసి పనిచేస్తోన్న సంగతి తెలిసిందే.
కానీ ఆ సీనియర్స్ లో సల్మాన్ కి మాత్రం నయన్ చోటు ఇవ్వలేదు.