ప్రేమ.ఈ రెండు అక్షరాలు ఎంత మధురమైనవో.అంతే బాధను కూడా తెపిస్తుంది.ఇందులో రెండు అక్షరాలా ఉన్న దాని లోతు మాత్రం చాలా పెద్దది.ప్రేమకు ఎలాంటి షరతులు లేకపోవడంతో ఏ వయసులో నైనా ఇది పుట్టడం కామన్ గా మారింది.నిజానికి యువకులలో ఈ ప్రేమ ఉంటుందని చాలామంది అనుకుంటారు.
కాకపోతే, అది పచ్చి అబద్ధం ప్రేమకి ఎటువంటి వయోపరిమితి ఉండదు.ఇకపోతే ప్రస్తుతం వైరల్ గా మారిన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది.
ఇక ఈ వైరల్ గా మారిన విషయం చూస్తే.

అమెరికా దేశ పౌరులైన హెరాల్డ్ టెరెన్స్, జీన్ స్వెర్లిన్ ( Harold Terence, Jean Schwerlin )ల ప్రేమ చారిత్రక ప్రేమికులైన రోమియో, జూలియట్ ( Romeo , Juliet )లకంటే కాస్త ఎక్కువనే చెప్పవచ్చు.వీరిద్దరూ వయసు చూస్తే హెరాల్డ్ కు 100 సంవత్సరాలు కాగా.జీన్ కు 96 సంవత్సరాలు.
వీరిద్దరూ కలిసి వచ్చే నెలలో ఫ్రాన్స్ లో ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు.దీనికి కారణం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హెరాల్డ్ ఫ్రాన్స్ లో పనిచేశాడు.
ఇకపోతే జూన్ 6న రష్యాలో జరగబోయే ఓ ఎయిర్ ఫోర్స్ కార్యక్రమం తర్వాత వివాహం చేసుకోబోతున్నారు.వీరి పెళ్లి రోజు 1944లో జరిగిన యుద్ధంలో వేలాదిమంది సైనికుల ప్రాణాలు కోల్పోగా వారి జ్ఞాపకార్థం వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.

” మా ప్రేమ మీరు ఇంతవరకు ముందు ఎప్పుడు వినని ప్రేమ కథ” అంటూ హెరాల్డ్ ఓ మీడియా సంస్థతో తెలిపారు.తాజాగా అతడి ఇంటిలో జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పాడు.ఆ సమయంలో వృద్ధ ప్రేమికులు ఇద్దరు యుక్త వయస్సులోలా చేతులు పట్టుకొని రొమాంటిక్ గా మారిపోయారు.ఇక ఈ సమయంలో జీన్ మాట్లాడుతూ.హెరాల్డ్ ఓ శతాధిక వృద్ధుడైన అతడు ఇప్పటికీ ఓ కుర్రాడిలా కనిపిస్తున్నాడని.అతను అందమైన వాడంటూ.
, మంచిగా ముద్దుగా ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది.అంతేకాదు అతని హాస్యం, అలాగే అతడి జ్ఞాపకశక్తి తనను ఎంతో ఆశర్యం కలిగిస్తాయని చెప్పుకొచ్చింది
.