ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి అనసూయ( Anasuya ) ఒకరు.ఈమె కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా పనిచేసేవారు.
అనంతరం జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమానికి యాంకర్ గా అవకాశాన్ని అందుకొని ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈమెకు జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ రావడంతో సినిమా అవకాశాలు వచ్చాయి.దీంతో జబర్దస్త్ కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా ఎన్నో విభిన్నమైనటువంటి కథ చిత్రాలలో విభిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి అనసూయకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అనసూయ కాలేజీలో చదువుతున్న సమయంలోనే పలు సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారట.అయితే ఈ విషయాన్ని ఈమె బయట పెట్టారు.2003 వ సంవత్సరంలో అనసూయ ఎన్టీఆర్( Ntr ) హీరోగా నటించిన నాగ( Naga ) సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించారని తెలుస్తుంది.
నాగ సినిమాలో భాగంగా ఓ కాలేజీలో జరిగిన సన్నివేషంలో అనసూయ కాలేజీ స్టూడెంట్స్ లో ఒకరిగా నటించారట.ఈ సినిమాలో భాగంగా సునీల్ మాట్లాడుతూ ఉండగా ఆయన వెనుక కొంతమంది స్టూడెంట్ నిల్చోని చూస్తూ ఉంటారు.అందులో అనసూయ కూడా ఉన్నారనే విషయం తాజాగా బయటపడటంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.అయితే అప్పట్లో ఈ పాత్రలో కనిపించినందుకు అనసూయకి ఇచ్చిన రెమ్యూనరేషన్ కేవలం 500 రూపాయలు మాత్రమే నట.ఇలా 500 కోసం అలాంటి పాత్రలలో నటించిన అనసూయ ఇప్పుడు మాత్రం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ నటిగా దూసుకుపోతున్నారు.