మెగాస్టార్ చిరంజీవి ఇటీవల పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ కార్యక్రమం అనంతరం ఈయన పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నారు.తాజాగా బిజెపి నేత కిషన్ రెడ్డి( Kishan Reddy ) తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూలో భాగంగా కిషన్ రెడ్డి అడిగే ప్రశ్నలకు చిరంజీవి( Chiranjeevi ) సమాధానాలు చెప్పారు.అయితే ఈయన కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి సినిమాల గురించి కూడా ప్రశ్నించారు.
ఇక మెగా ఫ్యామిలీలో అందరూ కూడా హీరోలు అనే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి చిరంజీవిని ప్రశ్నిస్తూ మీ ఇంట్లో అందరూ సినిమాలలో నటిస్తున్నారు.అయితే మీ సినిమాలో కాకుండా మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అలాగే మీ కుమారుడు రామ్ చరణ్( Ramcharan ) నటించిన సినిమాలలో మీకు ఏ సినిమా అంటే ఇష్టమని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో తనకు తొలి ప్రేమ ( Tholiprema ) సినిమా అంటే చాలా ఇష్టం అని తెలిపారు.
తొలిప్రేమ తర్వాత బద్రి,అత్తారింటికి దారేది, జల్సా వంటి సినిమాలో కూడా ఇష్టం అని తెలిపారు.ఇక చరణ్ నటించిన సినిమాలలో తనకు మగధీర సినిమా ( Maghadheera Movie ) అంటే చాలా ఇష్టమని చిరంజీవి తెలపగా వెంటనే కిషన్ రెడ్డి అవును ఈ సినిమా విడుదలైన సమయంలో మీరు అసెంబ్లీలో ఉన్నారు అప్పుడు మా దగ్గరకు వచ్చి మా అబ్బాయి నటించిన సినిమా చాలా బాగా ఆడుతుందని సంతోషంగా చెప్పారు.గుర్తుంది అంటూ కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.