మెగా కోడలు ఉపాసన ( Upasana ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.ఒకవైపు తన అత్తయ్యతో కలిసి చేస్తున్నటువంటి అత్తమ్మ కిచెన్ బిజినెస్ గురించి కూడా ఎన్నో వీడియోలను చేస్తూ ఉంటారు.
అయితే తాజాగా తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) పద్మ విభూషణ్ ( Padma vibhushan ) అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.
ఈ క్రమంలోనే ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఇందులో భాగంగా చిరంజీవి తన గదిలో రెడీ అవుతూ కనిపిస్తుంటారు.
ఇలా ఈ వీడియోలో భాగంగా రామ్ చరణ్ సుస్మిత అందరిని కూడా ఉపాసన చూపించారు.అయితే ఈ వీడియోలో ఉపాసన మాట్లాడుతూ మామయ్య గారు ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటండి అని అడగగా చిరంజీవి మాత్రం నాకు అద్భుతమైనటువంటి క్లిన్ కారా ( Klin Kaara ) ను బహుమతిగా ఇచ్చారు అంతకన్నా గొప్ప అవార్డు ఏది లేదంటూ ఉప్పొంగిపోయారు.అంతేకాకుండా నాకు క్లిన్ కారుకు ఉన్న పోలిక ఏంటి మామయ్య అంటూ అడిగారు.ఈ ప్రశ్నకు చిరంజీవి ఒక సెకండ్ ఆలోచించి నీ ప్రతిరూపమే క్లిన్ కారా అంటూ సమాధానం చెప్పారు.
చిరంజీవి ఇలా చెప్పడంతో కాదు మామయ్య గారు నేను క్లిన్ కారా ఇద్దరం కూడా పద్మ విభూషణ్ మనవరాళ్లం అంటూ ఉపాసన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే క్లిన్ కారా తాత చిరంజీవికి పద్మ విభూషణ అవార్డు వచ్చింది.అదేవిధంగా ఉపాసన తాతయ్య డాక్టర్ సి ప్రతాప్ రెడ్డికి కూడా పద్మ విభూషణ్ అవార్డు 2010వ సంవత్సరంలోనే వచ్చింది.దీంతో ఉపాసన మేమిద్దరం కూడా పద్మ విభూషణ్ మనవరాళ్ళు అంటూ కామెంట్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.