జూనియర్ ఎన్టీఆర్ బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా.. ఆ పాట అంటే అంత ఇష్టమా?

ప్రతి ఒక్కరి లైఫ్ లో కష్టాలు అనేవి కచ్చితంగా ఉంటాయి.స్టార్ సెలబ్రిటీలు సైతం ఇందుకు అతీతం కాదు.

 Shocking And Interesting Facts About Junior Ntr Details Here Goes Viral , Raal-TeluguStop.com

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ సరదాగా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.తారక్ బాధలో ఉన్న సమయంలో రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే సాంగ్ ను వినడానికి ఎంతో ఇష్టపడతారట.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఒక సందర్భంలో ఈ విషయాన్ని పంచుకున్నారు.

ఈ సాంగ్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తన దగ్గర మాట కూడా తీసుకున్నారని కీరవాణి చెప్పుకొచ్చారు.రాలిపోయే పువ్వా పాటను తాను ఎక్కడ పడితే అక్కడ పాడనని తారక్ కు మాట ఇచ్చానని కీరవాణి వెల్లడించడం గమనార్హం.తారక్ బర్త్ డే రోజున తారక్ కు ఆ పాటను నేను రికార్డ్ చేసి ఇచ్చానని కీరవాణి వెల్లడించారు.

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి( Keeravani) చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా( Devara movie )కే పరిమితం కాగా ఈ సినిమాలో రెండు లుక్స్ లో కనిపిస్తున్న తారక్ ఈ సినిమాతో కనీవిని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంటాననే నమ్మకంతో ఉన్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా లక్ కలిసొస్తుండటం మరింత ప్లస్ అవుతోంది.తారక్ ఏ ప్రాజెక్ట్ లో నటించినా ఆ ప్రాజెక్ట్ కలెక్షన్ల పరంగా అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

ఈతరం హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే వరుసగా ఆరు సినిమాలలో విజయం సాధించి సత్తా చాటారు.తారక్ భవిష్యత్తు ప్రాజెక్త్ లు ఒకింత భారీ స్థాయిలో సరికొత్త కాన్సెప్ట్ లతో తెరకెక్కుతుండగా ఆ సినిమాలకు తారక్ సోదరుడు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం సత్తా చాటేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube