ఎన్నికల ప్రచారం చివరి రోజు సీఎం జగన్ ప్రచార షెడ్యూల్..!!

ఏపీలో మే 13వ తారీకు పోలింగ్.ఈ క్రమంలో శనివారం ఎన్నికల ప్రచారానికి చివరి రోజు.

 Cm Jagan Campaign Schedule On The Last Day Of Election Campaign Details, Ap Elec-TeluguStop.com

వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) శనివారం మూడు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.ఉదయం 10 గంటలకు నరసారావు పేట( Narasarao Peta ) పార్లమెంటు పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లో జరిగే సభలో పాల్గొంటారు.

అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో తాలూకా ఆఫీస్ సెంటర్ లో జరిగే సభలో పాల్గొంటారు.

Telugu Ap, Cm Jagan, Cmjagan, Sarao Peta, Pawan Kalyan, Pithapuram, Vanga Geetha

చివరిగా మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం( Pithapuram ) అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఉప్పాడ బస్టాండ్ సెంటర్ లో జరిగే సభలో పాల్గొంటారు.పిఠాపురం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఇదే పిఠాపురం నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీత( Vanga Geetha ) పోటీ చేస్తున్నారు.

సరిగ్గా సాయంత్రం మూడు గంటలకు.పిఠాపురంలో సీఎం జగన్ ప్రచారం చేయనున్నారు.అక్కడితో ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకనున్నారు.2019 ఎన్నికలలో రికార్డు స్థాయిలో స్థానాలు గెలిచి వైఎస్ జగన్ పార్టీ విజయం సాధించింది.

Telugu Ap, Cm Jagan, Cmjagan, Sarao Peta, Pawan Kalyan, Pithapuram, Vanga Geetha

దీంతో 2024 ఎన్నికలలో అదేవిధంగా గెలవాలని భావిస్తున్నారు.ఏకంగా 175 కి 175 గెలవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేయడం జరిగింది.ఈ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను నిత్యం ప్రజలలో ఉండేలా రకరకాల పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు.సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి జగన్.

సిద్ధం, బస్సు యాత్రతో క్యాడర్ లో ఉత్సాహం కలిగేలా ప్రచారం చేశారు.ఎన్నికలు చివరికి వచ్చేసరికి రోజుకి రెండు మూడు సభలలో పాల్గొంటున్నారు.

మే 11వ తారీకు శనివారం చివరి రోజు కావడంతో మూడు సభలలో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube