మణిరత్నం( Mani Ratnam ).క్లాసికల్ సినిమాల దర్శకుడిగా సౌత్ ఇండియాలోనే స్టార్ డైరెక్టర్ గా గొప్ప గుర్తింపును పొందాడు.
దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు( Dasari Narayana Rao , Raghavendra Rao ) లాంటి వారు కమర్షియల్ సినిమాలతో కాసుల వర్షం కురిపిస్తున్న సమయంలో ఇలాంటి ఒక సినిమా కూడా తీయగలరా అనిపించేలా మణిరత్నం తీసి చూపించాడు.ఒక గీతాంజలి సినిమా చూస్తే చాలు మణిరత్నం ఎంత పెద్ద దర్శకుడు అని చెప్పడానికి.
హీరో అంటే ఫైట్స్, సాంగ్స్, రొమాన్స్ అంటూ రకరకాలుగా ఎన్నో ప్రయోగాలు చేస్తున్న తరుణంలో జబ్బు పడిన ఒక హీరో హీరోయిన్స్ తో స్టోరీ నడిపించి దాన్ని ఆల్ టైం ఫేవరెట్ క్లాసిక్ సినిమా తీర్చిదిద్దడానికి బట్టి మణిరత్నం టాలెంట్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి.
కేవలం గీతాంజలి సినిమా( Gitanjali movie ) మాత్రమే కాదు అనేక రియల్ టైం సంఘటనలను కూడా మణిరత్నం మనసును కదిలిస్తూ ఉంటాయి.బాంబే అల్లర్ల సమయంలో జరిగిన అనేక సంఘటనలు మనసులో జరగని ముద్ర వేసి అంటారు మణిరత్నం అందుకే అద్భుతమైన సంగీతంతో మరచిపోలేని ఒక తీయని జ్ఞాపకంగా ప్రతి ఒక్కరికి మిగిలిపోయే బొంబాయి( Bombay ) వంటి సినిమా తీశాడు.కాశ్మీర్ లో కాల్పులు జరుగుతున్న సమయంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రోజా సినిమా ( Roja movie )తీసి ఎంతో మంది ప్రేమికులకు జీవితంలో చెరగని జ్ఞాపకాలను మిగిల్చే చిత్రంగా ఈ సినిమాను మలిచాడు.
అందుకే మణిరత్నం కి పూర్తి కథ అందించాల్సిన అవసరం లేదు కేవలం ఒక లైన్ దొరికితే చాలు దాన్ని తీసుకొని ఎంతో అద్భుతమైన ఒక సినిమాను తీయడంలో తనకు తానే దిట్ట.
ఇప్పటి వారికి మణిరత్నం గురించి పూర్తిగా తెలియదనే చెప్పాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన తీస్తున్న సినిమాలు పెద్దగా ఆడటం లేదు చివరగా పొన్నియన్ సెల్వన్ అంటే సినిమా తీసిన మణిరత్నం రేంజ్ సినిమా అయితే అది కాదు.ఇప్పటి యూత్ కి రాజమౌళి, శంకర్, సుకుమార్ వంటి దర్శకులే తెలుసు.కానీ ప్రతి ఒక్కరూ చూడదగ్గ అద్భుతమైన ప్లాస్టిక్ సినిమాలను తీయడంలో మణిరత్నం తర్వాతే సౌత్ ఇండియాలో మరెవరైనా.