నారా రోహిత్ ( Nara Rohith )బాణం సినిమాతోనే నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఆ తర్వాత పరిశురాం డైరెక్షన్ లో చేసిన సోలో సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చుకోవడమే కాకుండా కమర్షియల్ సక్సెస్ ని కూడా అందుకున్నాడు.
ఇక ఆయన చాలా రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరం గా ఉంటూ వస్తున్నాడు.రీసెంట్ గా ప్రతినిధి 2 ( Pratinidhi 2 )అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించినప్పటికి తను సినిమాలు చేస్తాడా లేదంటే మళ్లీ సినిమాలకు బ్రేక్ ఇస్తాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఆయన చేయబోయే నెక్స్ట్ సినిమా మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.

మరి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తు ఆయన మార్కెట్ కాపాడుకుంటారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే తనతోపాటు ఉన్న హీరోలందరూ వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే ఆయన మాత్రం ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి చాలా వరకు దూరం గా ఉంటూ వస్తున్నాడు.మరి ఇప్పటికైనా తను వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతాడా లేదా అనే విషయాల మీద కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది.ఇక ఇంతకు ముందు తనతోపాటు గా సినిమాలు చేసిన శ్రీ విష్ణు, నిఖిల్ లాంటి హీరోలు వరుసగా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక ఇప్పుడు నారా రోహిత్ కూడా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.మరి అవి ఎంతవరకు నిజం అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది… చూడాలి మరి ప్రస్తుతం ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉంటాడా లేదా అనేది…
.







