పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )హీరో గా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా( OG movie ) మీద ప్రస్తుతం ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా సినిమా మీద హై వోల్టేజ్ అంచనాలను అయితే పెంచేసింది.
ఇక పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఎప్పుడు చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక చాలా రోజుల క్రితం మనం ఎలాగైతే పవన్ కళ్యాణ్ చూసామో ఇప్పుడు అలాంటి పవన్ కళ్యాణ్ మనకి ఈ సినిమాలో కనిపించబోతున్నాడు ఇక ఈ గ్లింప్స్ ను చూస్తే మనకు ఆ విషయం అర్థమైపోతుంది.
ఇక ఈ సినిమా మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో కూడుకొని ఉంటుందట.అయితే ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ( Emraan Hashmi ) విలన్ గా నటిస్తున్నాడు.

ఇక బాలీవుడ్ ( Bollywood )కి చెందిన ఈయనను ఆ పాత్రలో తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే పాన్ ఇండియాలో మార్కెట్ పరంగా ఆయన అయితే చాలా బాగా హెల్ప్ అవుతాడనే ఉద్దేశంతోనే ఆయన్ని ఈ సినిమాలో తీసుకున్నారు.అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి ఆయనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే వార్తలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

నిజానికి వీళ్ళిద్దరూ అన్నదమ్ములుగా ఈ సినిమాలో నటించబోతున్నారట.అయితే వీళ్ళ తండ్రి ఒక్కడే కానీ, తల్లులు ఇద్దరు కావడంతో వీరిద్దరి మధ్య అనుకోకుండా తగాదాలు రావడం దాని ద్వారా ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా మొత్తం నడుస్తుందట.మరి చివరికి ఎవరు ఎవరి పైన పై చేయి సాధించారు అనేదే ఈ సినిమా స్టోరీ గా తెలుస్తుంది… ఒక మొత్తానికైతే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
.







