ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ( Politics in AP )ప్రస్తుతం వేడివేడిగా సాగుతున్నాయి.ఎన్నికల సమయం దగ్గర పడడంతో పార్టీలు నువ్వు నేనా అనే రేంజ్ లో ప్రచారాలు చేస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాయి.
ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )జనసేన అధినేతకు ఇప్పటికే చాలామంది అభిమానులు పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.టాలీవుడ్ నుంచి కొంత మంది హీరోలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు.
అయితే బహిరంగ సభలకు వచ్చి స్పీచులు ఇవ్వలేకపోయినా కూడా వీడియోని రిలీజ్ చేశాడు చిరంజీవి.తన తమ్ముడి లాంటి నాయకుడు చట్ట సభల్లో ఉండాలిన, అధికారం లేకపోయినా ఎంతో మందికి సాయం చేశాడని, అలాంటి గొంతు అసెంబ్లీలో వినిపించాలని, గాజు గ్లాసుకు గుర్తు వేసి గెలిపించండి అంటూ పిఠాపురం ప్రజలను కోరాడు.ఇక చిరంజీవి వీడియోని రిలీజ్ చేసిన తరువాత చాలా మంది హీరోలు పవన్ కళ్యాణ్, జన సేన తరుపున ట్వీట్లు వేశాడు.
మెగా హీరోల్లో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి వారు అయితే ప్రచారాలు, ర్యాలీలు అంటూ తిరిగారు.
కేవలం మెగా ఫ్యామిలీ ( Mega Family )మాత్రమే కాకుండా జబర్దస్త్ కమెడియన్లు అయిన ఆటో రాంప్రసాద్, గెటప్ శీను, సుడిగాలి సుధీర్,హైపర్ ఆది లాంటి వారు కూడా పవన్ కళ్యాణ్ కి పూర్తి మద్దతుగా నిలిచారు.అంతే కాకుండా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పాల్గొంటూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించమంటూ ప్రజలను వేడుకుంటున్నారు.రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని వంటి వారు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.
ఇకపోతే తాజాగా సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి( Shriya Reddy ) కూడా పవన్ కళ్యాణ్‌కు ధైర్యంగా ముందుకు వచ్చి మద్దతు తెలిపింది.పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నది జరగాలని, ఆయనకు విజయం దక్కాలి అంటూ ట్వీట్ వేసింది.
గాజు గ్లాసుకు ఓటు వేయండి అని వేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.