టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం విజయోత్సవ సభకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.
విశాఖపట్నంలోని ఏయూ మైదానంలో సభ నిర్వహణ కోసం అనుమతి కోరితే ఇవ్వలేదని అచ్చెన్నాయుడు తెలిపారు.
అయితే ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను సక్సెస్ చేస్తామని తెలిపారు.సుమారు ఐదు లక్షల మంది సభకు హాజరవుతారన్న అచ్చెన్నాయుడు సభా వేదిక పై నుంచి టీడీపీ – జనసేన ఉమ్మడి సందేశం ఇవ్వబోతున్నామని వెల్లడించారు.
అలాగే త్వరలోనే మ్యానిఫెస్టోను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.