వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం లక్షలాది మంది భారతీయులు ( Indians )వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడే కుటుంబంతో సహా స్థిరపడుతున్నారు.
మనదేశంలో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలను కలిగివున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి.స్వాతంత్య్రానికి పూర్వమే పంజాబీలు కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో స్థిరపడ్డారు.
ఇక గల్ఫ్ దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో పంజాబీ ప్రవాసులు వున్నట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.ఆయా దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సాయపడుతున్నారు.
పంజాబ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్ఆర్ఐల ప్రయోజనాల విషయంలో పెద్ద పీట వేస్తుంది.తాజాగా సీఎం భగవంత్ మాన్( CM Bhagwant Mann ) నేతృత్వంలోని సర్కార్ కూడా ఇదే దిశగా ముందుకు వెళ్తోంది.అయితే ఎన్ఆర్ఐ కమీషన్ ఛైర్మన్, సభ్యుల నియామకంపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) శ్రద్ధ చూపం లేదని ప్రతిపక్షనేత పర్తాప్ సింగ్ బజ్వా( Partap Singh Bajwa ) మండిపడ్డారు.ఇది కమీషన్ పనితీరును నిర్వీర్యం చేయడమే కాకుండా ఎన్ఆర్ఐల ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తుందని బజ్వా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం భగవంత్ మాన్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్‌లకు( Kuldeep Singh Dhaliwals ) పలుమార్లు లేఖలు రాసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని ఆయన దుయ్యబట్టారు.
ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కమీషన్‌కు అధికారం ఇవ్వడంతో పాటు కొత్త చట్టాలను రూపొందించే బదులు నియామకంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కమీషన్ పనిని ప్రభుత్వం నిలిపివేసిందని పర్తాప్ ఆరోపించారు.ఇదే అంశాన్ని సీఎం భగవంత్ మాన్ సింగ్‌కు రాసిన లేఖలోనూ ఆయన లేవనెత్తారు.కమీషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ శేఖర్ ధావన్ ( Justice Shekhar Dhawan )పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసిందని, ఆయనతో పాటు సభ్యులుగా వున్న ఎంపీ సింగ్, గుర్జిత్ సింగ్ లెహల్, సవీందర్ సింగ్ సిద్ధూ, హర్దీప్ సింగ్ థిల్లాన్‌లు తమ పదవీ కాలాన్ని పూర్తి చేశారని పర్తాప్ గుర్తుచేశారు.
నాటి నుంచి పాత కేసులను విచారించడానికి, ఆదేశాలు జారీ చేయడానికి, కొత్త ఫిర్యాదులను స్వీకరించడానికి లేదా అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఎవరూ లేరని పర్తాప్ సింగ్ బజ్వా లేఖలో పేర్కొన్నారు.