ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Congress Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎలక్టోరల్ బాండ్స్ దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) విరాళాల వ్యాపారం ఇక బట్టబయలు కానుందని తెలిపారు.వంద రోజుల్లో స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్ల ధనాన్ని( Black Money ) వెనక్కి తెస్తామని చెప్పి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
విరాళాలు ఇచ్చే వారిపై బీజేపీ సర్కార్( BJP Govt ) వరాల జల్లు కురిపించి, సామాన్య ప్రజలపై పన్నుల భారం మోపిందని ఆరోపించారు.