రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, అదనపు కలెక్టర్లు ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి ( Gouthami Poojari అర్జీలు స్వీకరించారు.ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులు ఆయా శాఖల అధికారులు పరిశీలించి, వేగంగా పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.రెవెన్యూ శాఖకు 23, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 14, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 3, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి 3, చందుర్తి, కోనరావుపేట, తంగళ్లపల్లి ఎంపీడీవో కార్యాలయాలు, టౌన్ ప్లానింగ్, ఉపాధి కల్పన, సర్వే, డీఆర్డీఓ కార్యాలయాలకు ఒకటి చొప్పున మొత్తం 50 దరఖాస్తులు వచ్చాయన్నారు.







