Amazon CEO Jeff Bezos : ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుంది డబ్బులు ఖర్చు పెట్టకండి అమెజాన్ సంస్థ అధినేత సంచలన వ్యాఖ్యలు..!!

మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ స్థితిగతులను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.ఈ వైరస్ కారణంగా ప్రాణ నష్టంతో పాటు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు తల్లకిందులు అయిపోయాయి.

 Don't Spend Money Because Of Economic Recession Amazon Ceo Sensational Comments,-TeluguStop.com

సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది.ఈ క్రమంలో కొన్ని సంస్థలు మూతపడ్డాయి.

దీంతో ఇప్పుడు చాలా దేశాలలో నిరుద్యోగం పేరుకుపోయింది.ఐటీ వంటి సంస్థలలో కూడా ఉద్యోగాలు కోల్పోతున్నారు.

ఇటువంటి తరుణంలో అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రానున్న రోజులలో ఆర్థిక మంద్యం ముంచుకొస్తుందనీ… ప్రజలు అనవసర ఖర్చులకు పోకుండా డబ్బులు దాచుకోవాలని సూచించారు.

టీవీ, ఫ్రిడ్జ్ ఇంకా కారు… కొనాలనే ఆలోచన ఉన్నవాళ్లు వాటిని విరమించుకోవడం మంచిది అని హెచ్చరించారు.అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి.నగదు మీ వద్దనే ఉంచుకోండి.కొనడానికి బదులు.

డబ్బులు దాచుకోవటంపై ప్రజలు దృష్టి పెట్టాలి.రాబోయే రోజుల్లో అంతా మంచే జరగాలని అందరం కోరుకుందాం.

కష్ట కాలాన్ని కూడా తట్టుకునేందుకు అందరం సిద్ధమవుదాం అంటూ బెజోస్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube