సనాతన హిందూ సంప్రదాయంలో అత్యంత పురాతనమైన, పవిత్రంగా భావించే ‘‘స్వస్తిక్’’ గుర్తును నాజీ విద్వేషానికి చిహ్నమైన ‘‘హకెన్‌క్రూజ్’తో కలిపి చూడొద్దని అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హిందూ గ్రూప్ కోరింది.ఈమేరకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత సంతతి నేత జగ్మీత్ సింగ్‌లకు విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం కోవిడ్ పరిమితులకు, వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధనకు వ్యతి రేకంగా కెనడాలో వేలాది మంది ట్రక్కు డ్రైవర్లు భారీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో న్యూడె మొక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ) నేత జగ్మీత్ సింగ్ ఫిబ్రవరి 2న వివాదాస్పద ట్వీట్ చేశారు.
‘‘స్వస్తిక్‌లు, కాన్ఫెడరేట్ జెండాలకు కెనడాలో స్థానం లేదని ’’ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.దేశంలోని కమ్యూనిటీలను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత తమపై వుందని.
ఇది కెనడాలో ద్వేషపూరిత చిహ్నాలను నిషేధించే సమయమని జగ్మీత్ అన్నారు.జగ్మీత్ వ్యాఖ్యలకు మద్ధతుగా నిలిచిన ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం నిరసనకారులు ‘స్వస్తిక్ జెండాలను’ ఊపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై అమెరికాకు చెందిన హిందూపాక్ట్ (హిందూ పాలసీ రీసెర్చ్ అండ్ అడ్వకేసీ కలెక్టివ్) గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువులు, బౌద్ధులు, సిక్కు తదితర మతాలకు ప్రాచీనకాలంగా వస్తోన్న ‘స్వస్తిక్’ను ‘హకెన్ క్రూజ్’తో కలపవొద్దని కోరింది.
ఈ తప్పుడు వ్యాఖ్యల వల్ల.హిందువులు, సిక్కులపై ద్వేష పూరిత నేరాలకు దారి తీస్తుందని హిందూ పాక్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.
కెనడాలో గత నెలలోనే ఆరు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి దోచుకున్నారని హిందూపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్సవ్ చక్రవర్తి గుర్తుచేశారు.అలాగే కెనడా ప్రజలు శాంతి యుతంగా నిరసన తెలిపే హక్కును గౌరవించాలని ప్రధాని జస్టిన్ ట్రూడోను హిందూపాక్ట్ కోరింది.
ఏ ప్రజాస్వామ్యంలోనైనా శాంతి యుతంగా నిరసన తెలిపే హక్కు ప్రాథమికమైనదని చెప్పింది.భిన్నాభిప్రాయాలను అణిచివేసేందుకు ఎమర్జెన్సీ ఆర్డర్‌ను ప్రకటించడం కెనడాకు తొలిసారి విషాదకరమైన ఉదాహరణగా హిందూపాక్ట్ అభిప్రాయపడింది.