తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి నందమూరి కుటుంబానికి( ANR Family NTR Family ) మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది అనే సంగతి తెలిసిందే.అక్కినేని నాగేశ్వరరావు నందమూరి తారక రామారావు ఒకప్పుడు తెలుగు సినీ చిత్ర పరిశ్రమను ఏలిన వారు.
ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమకు వీరిద్దరూ రెండు కళ్ళు లాంటివారని చెప్పాలి.ఇక ఏఎన్నార్( ANR ) ఎన్టీఆర్ (NTR) కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇక అదే సాన్నిహిత్యాన్ని ఎన్టీఆర్ కుమారులు నాగేశ్వరరావు కుమారులు కూడా అనుసరిస్తూ వచ్చారు.

ఈ క్రమంలోనే అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున( Nagarjuna ) హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇక బాలకృష్ణ కూడా నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే నాగార్జున నందమూరి హరికృష్ణ( Hari Krishna )తో కలిసి పలు సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే.దీంతో వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధమో ఏర్పడింది.
ఇక నాగార్జున స్వయంగా హరికృష్ణ గారిని సొంత అన్నయ్యలాగే ఫీల్ అవుతూ తనని అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచే వారు.
ఇక హరికృష్ణ రోడ్డు ప్రమాదం( Hari krishna Death )లో చనిపోయినప్పుడు నాగార్జున ఎంతో ఎమోషనల్ అయ్యారు.నా అన్నయ్య నా పుట్టినరోజు చనిపోవడం నాకు చాలా బాధాకరం అంటూ పలు సందర్భాలలో నాగార్జున ఈ విషయాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.
ఇలా హరికృష్ణకు సొంత తమ్ముడిలా ఉండటమే కాకుండా హరికృష్ణ కుమారుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సొంత బాబాయ్ గా నాగార్జున వ్యవహరిస్తూ ఉంటారు.

నాగార్జున కూడా ఎన్టీఆర్ పట్ల అదే ప్రేమను చూపిస్తూ ఉంటారు పలు సందర్భాలలో నాగార్జున మాట్లాడుతూ నా పెద్ద కొడుకు ఎన్టీఆర్ అంటూ సంబోధించిన సంగతి మనకు తెలిసిందే.తన ఇద్దరు కొడుకులు పక్కనే ఉన్నప్పటికీ వారిద్దరినీ కాదని ఎన్టీఆర్ పక్కన నిలబడి నా పెద్ద కొడుకు అంటూ ఈయన ఆప్యాయంగా తనని పలకరించేవారు.ఎన్టీఆర్ సైతం నాగార్జునను నాగార్జున సార్, గారు అని పిలవకుండా ఎంతో ఆప్యాయంగా బాబాయ్ బాబాయ్ అంటూ పిలుస్తూ ఉంటారు.
ఇలా వీరి మధ్య నిజంగానే ఒక సొంత బాబాయ్ కొడుకు మధ్య ఉన్నటువంటి అనురాగం ఆప్యాయత ఉన్నాయనే విషయం తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు అటు అక్కినేని అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.