రష్యాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఆ ద్వీపం సంగతి తెలుసా?

ఇపుడు ఈ కథ వింటే, ‘బలవంతుడు నాకేమని… చలి చీమల చేతజిక్కి చావదె సుమతీ’ అనే కవి బద్దెన రాసిన పద్యం తప్పక గుర్తుకు వస్తుంది.అవును, యుక్రెయిన్ ని తక్కువ అంచనా వేసి, యుద్ధంలో దిగిన రష్యాకు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి.

 Do You Know What The Island Is Doing To Russia Without A Blink Of An Eye , Russia , Viral Latest , Viral News ,ukraine ,social Media , Putin S Army , Main Reason Crisis , Island , Snake Island-TeluguStop.com

అన్నింటి కంటే పెద్ద షాక్ ఏమంటే ఆ ద్వీపమే. మొత్తం కలిపి 0.17 కిలోమీటర్లు ఉంటుంది, అంతే.స్కేల్‌ పెట్టి కొల్చేంత వీలున్న అతిచిన్న ద్వీపమది.

పేరు స్నేక్‌ ఐలాండ్‌.ఇప్పుడు అదే అతి చిన్న ద్వీపం రష్యాకు కునుకు లేకుండా చేస్తోంది.వేల ఏళ్ల చరిత్ర వున్న ఆ చిన్న దీవి.ఇప్పుడు రష్యాకు పక్కలో బల్లెంలా మారింది.

 Do You Know What The Island Is Doing To Russia Without A Blink Of An Eye , Russia , Viral Latest , Viral News ,Ukraine ,social Media , Putin S Army , Main Reason Crisis , Island , Snake Island-రష్యాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఆ ద్వీపం సంగతి తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాని జోలికి ఎందుకు పోయామా అని ఇపుడు పుతిన్‌ సైన్యం తలపట్టుకుంది.ఎందుకంటే వరుసగా యుద్ధ నౌకల ధ్వంసం రష్యాకు మింగుడు పడటం లేదు.

మొత్తం కొలిచినా పావు కిలో మీటర్‌ కూడా లేని స్నేక్‌ ఐలాండ్‌ అనేది అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రదేశం.సముద్ర మట్టానికి కేవలం 135 అడుగుల ఎత్తులో వున్నా దాని ప్రత్యేకత మరే ద్వీపానికి లేదు.

అలాంటి దానిమీద కన్నేస్తే యుక్రెయిన్‌ ని భారీగా దెబ్బతీయొచ్చని కలలు గన్న రష్యా ప్లాన్ బెడిసి కొట్టింది.ఈ క్రమంలో మాస్కోవా యుద్ధ నౌక, ఆ ద్వీపంపై క్రూజ్‌ క్షిపణుల వర్షం కురిపించి, అక్కడి కట్టడాలను, లైట్‌హౌస్‌ను కూల్చి వేసింది.

కానీ స్నేక్‌ ఐలాండ్‌పై పట్టు సాధించామనే రష్యా ఆనందం…గాల్లో కలిసిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు.

రానురాను ఆ దీవి రష్యాకు మృత్యు దీవిగా మారిపోయింది.తాజా లెక్కల ప్రకారం రష్యాకు చెందిన 2 భారీ యుద్ధ నౌకలతో సహా 3 నౌకలు ఈ బ్లాక్‌ సీలో మునిగిపోయాయి.చాలా మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన రష్యాకు పెద్ద షాక్‌ ఇచ్చింది.ఆ తర్వాత కూడా యుక్రెయిన్‌ క్షిపణులు రష్యాకే చెందిన మరో యుద్ధ నౌకను ధ్వంసం చేశాయి.

అదే ద్వీపం సమీపంలో మరో నౌకను ముంచేసినట్టు వీడియోతో సహా యుక్రెయిన్‌ లేటెస్ట్‌గా ట్వీట్‌ చేయడం రష్యా జీర్ణించుకోలేకపోతోంది.వాస్తవానికి 1991 తర్వాత సోవియట్‌ పతనంతో స్నేక్‌ ఐలాండ్‌ యుక్రెయిన్‌ చేతికి వచ్చింది.

ఇప్పుడు ఆ పావు కిలోమీటర్‌ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో రష్యా భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube