ఈ వాట్సాప్‌ ఫీచర్‌ గురించి తెలుసా? మీకు నచ్చిన ఫొటోను ఇలా స్టిక్కర్‌గా మార్చుకోవచ్చు!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాటింగ్‌ మెసేజెస్ కి సంబంధించి వాట్సాప్ ఎంత ప్రాచుర్యం పొందిందో వేరే చెప్పనవసరం లేదు.జనాలు కూడా కొన్ని సార్లు టాకింగ్‌ కంటే ఎక్కువగా చాటింగ్‌కు మొగ్గు చూపుతారు.

 Do You Know About This Whatsapp Feature , Whatsapp, Chat, New Features, Image,t-TeluguStop.com

ఈ క్రమంలో దాని ప్రాముఖ్యత తెలుసుకున్న వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్లకోసం అనేక మార్పులు చేర్పులు చేస్తూ వస్తోంది.ప్రస్తుతం అలా చాటింగ్‌ చేసుకోవడానికి యువత కొన్ని షార్ట్‌ కట్స్ ఉపయోగిస్తోంది.

దాన్ని దృష్టిలో పెట్టుకొని వంద పదాల్లో చెప్పే విషయాలను ఎమోజీ, స్టిక్కర్ల రూపంలో వాట్సాప్ సౌకర్యం కల్పిస్తోంది.అయితే ఇలాంటి స్టిక్కర్లను కొన్ని రకాల థార్డ్‌ పార్టీ యాప్‌లను ఉపోయోగించి కూడా తయారు చేసుకోవచ్చు.

అదెలాగంటే కొంతమంది తమ సొంత ఫొటోలను కూడా స్టిక్కర్స్‌గా ఇట్టే మార్చేసికుంటారు.దానికి కొన్ని రకాల యాప్స్ అందుబాటులో వున్నాయి.ఇదిలా ఉంటే, వాట్సాప్‌ ఇన్‌బిల్ట్‌గా ఇలాంటి ఫీచర్‌ను ఒకదాన్ని అందించింది.వాట్సాప్‌లోనే నేరుగా స్టిక్కర్‌ను తయారు చేసుకోవచ్చు.

వాట్సాప్‌లో స్టిక్కర్లను ఎలా తయారు చేసుకోవచ్చో ఇపుడు స్టెప్‌ బై స్టెప్‌ తెలుసుకుందాం.

1.దానికోసం ముందుగా కంప్యూటర్‌లో వాట్సాప్‌ వెబ్‌ ఓపెన్‌ చేయాలి.

2.

తరువాత కాంటాక్ట్‌ లిస్ట్‌లోకి వెళ్లి మీకు నచ్చిన కాంటాక్ట్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

3.అనంతరం ‘స్మైలీ’ సింబల్‌ పక్కన ఉన్న పేపర్‌ క్లిప్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

4.దాని తరువాత అందులోని ‘స్టిక్కర్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

5.

స్టిక్కర్‌ ఆప్షన్‌ను ఎంచుకున్న వెంటనే గ్యాలరీలో ఉన్న ఫొటోలు మనకు కనిపిస్తాయి.అందులో మనం స్టిక్కర్‌గా మార్చాలనుకుంటున్న ఫొటోను సెలెక్ట్ చేసుకోవాలి.

6.దాంతో వెంటనే ఫొటో స్టిక్కర్‌గా మారిపోతుంది.అనంతరం మనకు కావాల్సినట్లుగా ఫొటోను ఎడిట్‌ చేసుకునే వెసులుబాటు కూడా అక్కడ కలదు.

7.

చివరిగా స్టిక్కర్‌ను సేవ్‌ చేసుకొని, మీరు సెలక్ట్‌ చేసుకున్న కాంటాక్ట్‌ నెంబర్ కి పంపొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube