గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో డైరెక్టర్ రాకేష్, చైత్ర రెడ్డి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారడంతో వారు తాజాగా సీక్రెట్ గా జరిగిన ఎంగేజ్మెంట్ తో ఆ వార్తలకు బ్రేక్ వేశారు.దీంతో వీరిద్దరు అది త్వరలోనే జంట కాబోతున్నారు.
అత్యంత నిరాడంబరంగా కేవలం కొద్దిమంది సమూహంతో మాత్రమే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా జరిగిన ఈ నిశ్చితార్థ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు లోకి వెళితే…
తమిళంలో కల్యాణ ముదల్ కాద్ వారై సీరియల్ తో చైత్ర రెడ్డి తమిళ టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది.అయితే ఆవిడ మాత్రం “యారాడి నీ మోహిని” సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆవిడ సంపాదించుకుంది.అయితే మార్చి మాసంలో తాను రాకేష్ సామల తో ప్రేమలో ఉన్నట్లు ఆవిడ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పకనే చెప్పింది.
అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో వారిద్దరిపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి.అయితే తాజాగా వీరిద్దరికీ జరిగిన నిశ్చితార్థం కార్యక్రమం సినీ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
కేవలం వారిద్దరికి సంబంధించిన కుటుంబ సభ్యులు, అలాగే దగ్గరి స్నేహితులకు మధ్య మాత్రమే ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరుపుకొని వారి అభిమానులకు షాక్ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ కార్యక్రమంలో పసుపుపచ్చని చీరలో చైత్ర రెడ్డి మెరిసిపోగా రాకేష్ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు.చైత్ర రెడ్డి చేతికి ఉంగరాన్ని తోడగడంతో వారి కలిసి జీవించే బోయే జీవితానికి మొదటి అడుగు వేసినట్లయింది.
ఇకపోతే ఈ కార్యక్రమం సంబంధించి రాకేష్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ ” జీవితంలో తారసపడిన ఓ కొత్త వ్యక్తితో ఎన్నో విషయాలను మొదలుపెట్టవచ్చు.ఆ సంఘటన ఆ వ్యక్తికి అద్భుతంగా ఆరంభం కావచ్చు.
భవిష్యత్తులో గొప్ప అనుభూతిని పొందుతారు అని నమ్మకం ఏర్పడింది.దాంతో తాను మంచి వ్యక్తి అవుతానని భావన కలుగుతుంది ” అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు.
ఇక చివరగా లవ్ యు నాని అంటూ తెలిపాడు.