పొత్తుల పేచీ : ఆ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన వార్ 

ఏపీలో వైసిపి( YCP ) మరోసారి అధికారంలోకి రాకుండా చేయడంతో పాటు , తాము  అధికారంలోకి వచ్చే విధంగా టిడిపి , జనసేన పార్టీలు( TDP Janasena ) పొత్తులు పెట్టుకున్నాయి.తమ రెండు పార్టీలు కలిస్తే ఏపీలో అధికారంలోకి రావడం సులువు అని రెండు పార్టీల అధ్యక్షులు బలంగా నమ్ముతున్నారు .

 Differences Between Tdp Janasena Leaders Over Contesting In These Constituencies-TeluguStop.com

ఆ నమ్మకంతోనే వచ్చే ఎన్నికల్లో( AP Elections ) కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.రెండు పార్టీల అధ్యక్షులు మధ్య ఈ విషయంలో మంచి అండర్ స్టాండింగ్ ఉన్నా , క్షేత్రస్థాయిలో మాత్రం రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు మధ్య సమన్వయం కల్పించడంలో చాలా నియోజకవర్గాల్లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం ఆ రెండు పార్టీలకు తలనొప్పిగా మారింది.దశాబ్దాలుగా టిడిపి నుంచి పోటీ చేస్తున్న సీనియర్ నేతలు పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాన్ని త్యాగం చేసేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.జనసేన నుంచి తాము పోటీ చేస్తున్నామని, ఈ మేరకు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని , అందుకే క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నామని చెబుతూ ఉండడం పై ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న టిడిపి సీనియర్లకు( TDP Senior Leaders ) తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

Telugu Alapati Raja, Ap, Janasena, Kandula Durgesh, Tdpjanasena, Ysrcp-Politics

దీంతో చాలా నియోజకవర్గాల్లో వివాదాలు మొదలయ్యాయి.జనసేన పోటీ చేయడం ఖాయం అనుకున్న నియోజకవర్గాల్లో టిడిపి టికెట్ ఆశిస్తున్న సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతూ,  మద్దతుదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.అయితే ఇప్పటివరకు టిడిపి జనసేన లో తమ పార్టీ నుంచి పోటీ చేయ అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు.ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేదానికైనా క్లారిటీ ఇవ్వలేదు.

దీంతో రెండు పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న నేతల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.

Telugu Alapati Raja, Ap, Janasena, Kandula Durgesh, Tdpjanasena, Ysrcp-Politics

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం విషయానికొస్తే జనసేన కీలక నేత కందుల దుర్గేష్( Kandula Durgesh ) ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.ఎన్నికల ప్రచారం కూడా చేసుకుంటున్నారు.దీంతో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి( Gorantla Butchaiah Chowdary ) తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇదే విధంగా గుంటూరు జిల్లా తెనాలిలో సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్( Alapati Rajendra Prasad ) పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా,  ఇక్కడి నుంచి తానే పోటీ చేస్తున్నట్లుగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) ప్రకటించారు.దీంతో ఇక్కడా వివాదం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube