అలనాటి అందాల రాసి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆమె అందం ముందు ఎందరు వచ్చిన తక్కువే.
అలాంటి ఈ నటి ఎన్నో అద్బుతమైన సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయింది.అలాంటి ఈ స్టార్ హీరోయిన్ రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
పెళ్లి జరిగిన సంవత్సరానికే హెలికాఫ్టర్ యాక్సిండెంట్ లో మరణించి అభిమానులకు, సినీ ఇండస్ట్రీకి తీరని శోకాన్ని మిగిల్చింది.
ఆ తర్వాత సౌందర్య ఆస్తులపై ఎన్నో గొడవలు జరిగాయి.
సొంత కుటుంబీకులే ఆస్తుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు.అయితే కొద్దికాలానికి రాజీకి వచ్చి ఆస్తిని పంచుకున్నారు.
అయితే సౌందర్య పెళ్ళైన సమయంలోనే ఆమె ఆస్తిని అంత భర్త రఘు పేరు మీద రాసింది.ఇక ఆమె ఆస్తితో మరొక మహిళను పెళ్లి చేసుకున్నాడు.
ఆమె పేరు అపూర్వ.ఆమెను రెండో పెళ్లి చేసుకొని గోవా లో స్థిరపడ్డాడు.సౌందర్య ఉన్నంత కాలం ఎంతోమంది పేదలకు సాయం చేసింది.ఆమె పుట్టి పెరిగిన ఊరుకు మంచి పేరు తీసుకొచ్చింది.
అప్పట్లోనే స్టార్ హీరోల అందరి సరసన నటించిన సౌందర్యకు, జగపతి బాబు మధ్య ప్రేమాయణం ఉందని పలు పుకార్లు వినిపించేవి.ఇందుకు సంబంధించి ఇప్పటికి ఎక్కడో ఒక చోట పుకార్లు వస్తూనే ఉంటాయి.