సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, రిజిస్ట్రార్పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు అయింది.దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
అనంతరం సెక్రటరీ జనరల్ తో పాటు రిజిస్ట్రార్ పై కోర్టు ధిక్కార పిటిషన్ వేయడం ఏంటని పిటిషనర్ ను న్యాయస్థానం మందలించింది.
దీన్ని ఖండిస్తున్నామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం బురద జల్లే కార్యక్రమం తప్ప మరొకటి కాదని పేర్కొంది.
నిర్దిష్ట తేదీలో కేసులను జాబితా చేయలేని పక్షంలో జడ్జీలపై కూడా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ఇటువంటి చర్యలు తగదని ధర్మాసనం స్పష్టం చేసింది.