మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం నోటీసులు కొత్తేమీ కాదని మాజీ మంత్రి మల్లారెడ్డి( Ex Minister Mallareddy ) అన్నారు.అవిశ్వాస నోటీసుల వలనే దుబాయ్, గోవా వెళ్లామని తెలిపారు.
బీఆర్ఎస్( BRS ) ప్రజాప్రతినిధులను టూర్లకు తీసుకెళ్లి కూల్ చేస్తున్నామని మల్లారెడ్డి పేర్కొన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీనే( Congress ) వెయ్యి మీటర్ల లోతున ఉందన్న ఆయన బీఆర్ఎస్ కాదని పేర్కొన్నారు.కావాలనే కాంగ్రెస్ తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉందని ప్రశ్నించారు.