తెలుగుజాతికి తీరని లోటు..రామోజీరావు మృతి పట్ల చిరంజీవి దిగ్బ్రాంతి..!!

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ( Ramoji Rao ) పార్థివ దేహానికి చిరంజీవి( Chiranjeevi ) నివాళులు అర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ రామోజీరావులో అందరూ గంభీరమైన వ్యక్తిని చూసుంటారని తాను మాత్రం చిన్నపిల్లాడిని చూశానని వ్యాఖ్యానించారు.

 Chiranjeevi Mourns The Death Of Ramoji Rao A Huge Loss For The Telugu Nation Det-TeluguStop.com

రామోజీరావుకు పెన్నులు అంటే చాలా ఇష్టం.ప్రజారాజ్యం పార్టీ( Prajarajyam Party ) నడుపుతున్న సమయంలో ఆయనకు ఒక పెన్ను బహుకరించా.

దాన్ని చూసి మురిసిపోయారు.ఆయన దగ్గర ఉన్న పెన్నుల కలెక్షన్ నాకు చూపించారు.

తన ఆలోచనలకు తగినట్లుగా వాటిని వినియోగిస్తూ అక్షర రూపంలో పెట్టేవారు.ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన ప్రారంభంలో ఆయన సలహాలు సూచనలు తీసుకునేవాడిని.

ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఆయన చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు.ఆయన సమాజహితం కోసం పని చేశారన్నారు.సమాజానికి ఏం చేయాలో నిత్యం అక్షరరూపంలో రాసేవారు రామోజీరావు మృతి ఆయన కుటుంబానికే కాదు.తెలుగుజాతికి తీరని లోటు. ఒక మహా వ్యక్తిని శక్తిని కోల్పోయాం అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.రామోజీరావు మృతికి చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ షూటింగ్స్ ఆపేయటం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది.

రామోజీ అంత్యక్రియలు రేపు రామోజీ ఫిలిం సిటీలో( Ramoji Film City ) జరగనున్నాయి.తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube