తెలుగుజాతికి తీరని లోటు..రామోజీరావు మృతి పట్ల చిరంజీవి దిగ్బ్రాంతి..!!
TeluguStop.com
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ( Ramoji Rao ) పార్థివ దేహానికి చిరంజీవి( Chiranjeevi ) నివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ రామోజీరావులో అందరూ గంభీరమైన వ్యక్తిని చూసుంటారని తాను మాత్రం చిన్నపిల్లాడిని చూశానని వ్యాఖ్యానించారు.
రామోజీరావుకు పెన్నులు అంటే చాలా ఇష్టం.ప్రజారాజ్యం పార్టీ( Prajarajyam Party ) నడుపుతున్న సమయంలో ఆయనకు ఒక పెన్ను బహుకరించా.
దాన్ని చూసి మురిసిపోయారు.ఆయన దగ్గర ఉన్న పెన్నుల కలెక్షన్ నాకు చూపించారు.
తన ఆలోచనలకు తగినట్లుగా వాటిని వినియోగిస్తూ అక్షర రూపంలో పెట్టేవారు.ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన ప్రారంభంలో ఆయన సలహాలు సూచనలు తీసుకునేవాడిని.
"""/" /
ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఆయన చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు.
ఆయన సమాజహితం కోసం పని చేశారన్నారు.సమాజానికి ఏం చేయాలో నిత్యం అక్షరరూపంలో రాసేవారు రామోజీరావు మృతి ఆయన కుటుంబానికే కాదు.
తెలుగుజాతికి తీరని లోటు.ఒక మహా వ్యక్తిని శక్తిని కోల్పోయాం అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.
రామోజీరావు మృతికి చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు చలనచిత్ర పరిశ్రమ షూటింగ్స్ ఆపేయటం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది.రామోజీ అంత్యక్రియలు రేపు రామోజీ ఫిలిం సిటీలో( Ramoji Film City ) జరగనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనుంది.
కొబ్బరి పాలతో మీ కురులు అవుతాయి డబుల్.. ఎలా వాడాలంటే?