జ్యోతిష్యం ఎప్పుడూ వందకు వంద పాళ్ళు నిజం కాదు.అవి కేవలం అంచనాలకు దరిదాపుల్లో మాత్రమే ఉంటాయి.
ప్రేడిక్షన్ చేస్తున్నప్పుడు 90 శాతం వాస్తవికతతో కూడిన విషయాలనే చెబుతూ ఉంటారు జ్యోతిష్యులు.కానీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఫేమస్ అవడం కోసమే జాతకాలు చెబుతున్నారు.
ఆ చెప్పడం చెప్పడమే ఏ ఫేమస్ సెలబ్రిటీస్ పేర్లపై జాతకాలు చెబుతూ వారు విడాకులు తీసుకుంటారు లేదా వీరు జీవితం లో ఎదగలేరు లేదంటే అతను సీఎం అవుతాడు, ఇతడికి మూడు పెళ్లిళ్లు అవుతాయి అంటూ చెబుతూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు.ఇలా రాజకీయ, సిని జాతకాలు చెబుతూ వేణు స్వామి( Venu Swamy ) కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
అలాగే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు.

ఆయన ఇప్పటి వరకు ఎన్నో సంచలనమైన జ్యోతిష్యాలు చెప్పారు.అయితే అందులో కొన్ని నిజమైన మరికొన్ని పప్పులో కాలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.వేణు స్వామి చెప్పిన ఐదు రాంగ్ ప్రెడిక్షన్స్ ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మొదటిగా ప్రభాస్( Prabhas ) గురించి మాట్లాడి వేణు స్వామి పెద్ద తప్పు చేశారు.ఎందుకంటే ఆయనకు అసలు సినిమాలు వర్కౌట్ అవ్వవు.ఆయన కెరియర్ పూర్తిగా ముగిసిపోయింది అన్నట్టుగా మాట్లాడారు.దాంతో అందరూ ఆందోళన చెందినప్పటికి, సలార్ సినిమా( Salaar ) విజయం సాధించడంతో మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చారు ప్రభాస్.
ఈ విషయంలో వేణు స్వామి బోల్తా కొట్టారు.ఇక తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం( TRS Government ) అలాగే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం( Jagan Government ) వస్తుంది అని 2024 ఎలక్షన్స్ ని( 2024 Elections ) ఆధారంగా చేసుకుని చెప్పారు.

ఈ రెండు కూడా పూర్తిగా అవాస్తవాలు అని తేలింది.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రాలో కూటమి అధికారుల్లోకి వచ్చింది.ఇక తాజా ఐపీఎల్ సీజన్ లో ఈ సారి SRH బాగా ఆడుతుంది చూసి కప్పు కొడుతుంది అని చెప్పారు.కానీ ఫైనల్ లో బొక్క బోర్లా పడింది.
అంతకన్నా ముందు గతంలో ఇండియా వరల్డ్ కప్ కూడా గెలుస్తుంది అంటూ వేణు స్వామి చెప్పారు కానీ అది కూడా వర్కవుట్ అవ్వలేదు.ఇలా ఈ ఐదు సార్లు కూడా వేణు స్వామి తప్పుగా ప్రెడిక్షన్ చేశారు.
దానివల్ల ఇటీవలే ఇక జ్యోతిష్యాలు జాతకాలు చెప్పబోయేది లేదు అంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు.







