ఒక సినిమా తీయాలంటే దానికి ఒక మంచి కథ, అందుకు తగ్గట్టుగా కథనము, అలాగే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అన్ని చక్కగా కుదరాలి.మరి ఇన్ని సరిగ్గా ఉంటేనే సినిమా చక్కగా బయటకు వస్తుంది.
అలాంటి ఒక సినిమాను నిర్మించే నిర్మాణ సంస్థ అంతకన్నా మంచి పేరును కలిగి ఉంటే అది త్వరగా జనాల నోళ్ళలో నానుతుంది.మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని ఎంతో ఆలోచించి పేరు పెట్టిన సినిమా ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి.
వాటి అర్థం తెలియకపోయినా ఎప్పుడు వాటి గురించే ప్రస్తుతం ఉన్న యువత మాట్లాడుకుంటూ ఉంటారు.మరి అలా ఎంతో అర్థం ఉన్న పేర్లు కలిగినటువంటి ఆ నిర్మాణ సంస్థలు ఏంటి ? అవి ఎవరి నిర్మాణ సారధ్యంలో నడుస్తున్నాయి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వైజయంతి మూవీస్

వైజయంతి మూవీస్( Vyjayanthi Movies ) తనగానే అశ్విని దత్( Ashwini Dutt ) ఎప్పుడు స్థాపించిన ఒక నిర్మాణ సంస్థ అని మాత్రమే అందరికీ తెలుసు.కానీ వైజయంతి అనే పేరు ఎవరిది ? అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది ? అనే విషయం మాత్రం ఇప్పటి వారికి తెలిసే అవకాశం లేదు.ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించిన అశ్విని దత్తు గారు తను సినిమా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్టీఆర్ గారిని పేరు పెట్టమని అడిగారట.దాంతో ఎప్పుడు వాడిపోనటువంటి కృష్ణుని మెడలో ఉన్న వైజయంతి మాల పేరులోంచి వైజయంతిని తీసుకొని అశ్విని దత్ గారికి సూచించడం జరిగింది.
ఆయన అదే పేరు నూతన నిర్మాణ సంస్థకి పెట్టుకున్నారు.అలాగే కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ గారి బొమ్మనే తన లోగోగా కూడా వాడుకుంటున్నారు.
గీత ఆర్ట్స్

చాలామంది గీత ఆర్ట్స్( Geetha Arts ) అనగానే అల్లు అరవింద్( Allu Aravind ) భార్య పేరు గీత అని అనుకుంటారు.కానీ గీతా అనే పేరు భగవద్గీత నుంచి తీసుకున్నారు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్.గీత సారాంశం ఏమిటి అంటే మనం చేసే పని చేయాలి కానీ దాని ఫలితాన్ని ఆశించకూడదు అని.అలాగే మంచి సినిమాలు తీయడం వరకే మన బాధ్యత.ఎలా అది వసూళ్లు సాధిస్తుంది దాని విజయం లేదా పరాజయం అనేది మనం ఆశించకూడదు అని చెప్పడమే గీత యొక్క అర్థం.అందుకే తన సంస్థకి గీత ఆర్ట్స్ అనే పేరు పెట్టుకున్నారు అల్లు అరవింద్.
హోంబలె ఫిలిమ్స్

ఇక పునీత్ రాజ్ కుమార్ స్నేహితుడు తను నిర్మాణ సంస్థని స్థాపిస్తూ దానికి ఒక మంచి పేరుని సూచించమని పునీత్ ని అడిగాడట.దానికి కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయినా హోంబలమ్మ అనే ఒక దేవత పేరుని తీసుకొని హోంబలె ఫిలిమ్స్( Hombale Films ) అని పేరుని పునీత్ రాజ్ కుమార్ తన స్నేహితుడికి సూచించడంతో అదే పేరు ఖాయం చేసుకున్నారు.దానిపైనే ఇటీవలే కే జి ఎఫ్, మాస్టర్ పీస్, కాంతారా, సలార్ వంటి సినిమాలు రూపుదిద్దుకున్నాయి.







