ఇండస్ట్రీలో ఏదైనా ఒక సినిమా హిట్ అయింది అంటే అదే ఫార్ములా బేస్ చేసుకుని అనేక సినిమాలు వస్తాయి.ఈ ఒరవడి చాలా ఏళ్లుగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉంది.
అయితే స్టార్ హీరో అయినా ఎన్టీఆర్( NTR ) కూడా ఇలా హిట్ అయిన సినిమాలు బేస్ చేసుకుని తాను అదే ఫార్ములాతో సినిమా తీస్తాడు అంటే మీరు నమ్ముతారా ? అలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు పక్క హీరో ని చూసి కాపీ కొట్టి సినిమా చేశాడు జూనియర్ ఎన్టీఆర్.అలా చేయడానికి కేవలం సక్సెస్ ఫార్ములా మాత్రమే కారణం అయ్యుండొచ్చు కానీ ఒక స్టార్ హీరో ఇలా పక్క స్టార్ హీరోని కాపీ కొట్టడం అనేది కాస్త విచిత్రం గానే ఉంటుంది.
మరి అలా నాలుగు సార్లు చేసిన ఆ సినిమాలు ఏంటి? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారిగా అలా ప్రయత్నించింది కంత్రి సినిమాతో.( Kantri Movie ) అప్పుడే మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా( Pokiri Movie ) విడుదలై సంచలనం సృష్టించింది.దానిని కాపీ కొట్టి కాస్త అటు ఇటుగా స్టోరీ మార్చి సేమ్ ఆటిట్యూడ్ తో కంత్రి సినిమాతో వచ్చిన అది పూర్తిగా పరాజయం పాలైంది.
ఇక మరొక సక్సెస్ స్టోరీ ని నమ్ముకొని జూనియర్ ఎన్టీఆర్ శక్తి సినిమాతో( Sakthi Movie ) నటించారు.అప్పుడే రామ్ చరణ్ మరియు రాజమౌళి కాంబినేషన్లో మగధీర సినిమా( Magadheera ) వచ్చింది.
కాస్త హిస్టారికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలు చూసి మనసు పారేసుకున్న జూనియర్ శక్తి సినిమా కథకు ఓకే చెప్పారు.కానీ దాని రిజల్ట్ ఎలా వచ్చిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
నాన్నకు ప్రేమతో( Nannaku Prematho ) అనే సినిమా కూడా ఒక సినిమాను బేస్ చేసుకుని తారక్ చేశారనే విషయం చాలా మందికి తెలియదు.మహేష్ బాబు నటించిన 1.నేనొక్కడినే( One Nenokkadine ) సినిమాలు చూసిన తర్వాత ఆ సినిమా తరహాలోనే నాన్నకు ప్రేమతో అని ప్రయత్నించి మంచి సక్సెస్ అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.ఈ విషయంలో మహేష్ బాబు కాస్త వెనకబడ్డారని చెప్పుకోవచ్చు.
ఇక బాద్‍షా సినిమా( Baadshah ) వెనకాల కూడా ఇంచుమించు ఇలాంటి కాపీ కంటెంట్ స్టోరీనే ఉంది.మహేష్ బాబు మరో సినిమా దూకుడు( Dookudu ) రాగానే దాన్ని ఆధారంగా చేసుకుని బాద్‍షా కి ముహూర్తం చేశాడు జూనియర్ ఎన్టీఆర్.ఇలా ఈ నాలుగు సినిమాలు కాఫీ సినిమాలు అనే విషయం అందరికీ తెలుసు.అయితే ఇప్పుడు ఈ తరహా ప్రయోగాలు తారక్ చేయడం లేదు.