ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యి సంచలనం సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి అసలు ఏ విషయం మీద జగన్ తో సమావేశం అయ్యారు అన్న విషయంలో ఎవరికి క్లారిటీ రాలేదు.కేవలం సైరా సినిమా చూడాల్సిందిగా జగన్ కోరేందుకు, ఆ సినిమా స్పెషల్ షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే కృతజ్ఞతలు తెలిపేందుకు చిరంజీవి జగన్ కలిసినట్టు వార్తలు బయటకు వచ్చాయి.
కానీ వీరిద్దరి మధ్య ఆ సమావేశంలో రాజకీయ చర్చలు జరిగాయని, చిరుకి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వినిపించాయి.అయితే ఇందులో ఎంత వాస్తవం ఉన్నదన్నది ఎవరికి తెలియదు.
ఇక ఈ భేటీపై చిరు పవన్ మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది.సోషల్ మీడియాలో ఇద్దరు అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు.

ఈ గొడవలు ఇలా ఉండగానే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆయన అపాయింట్మెంట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మేరకు ఈనెల 16వ తేదీన ఢిల్లీ వెళ్లేందుకు చిరంజీవి ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.ఆయనతోపాటు టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఢిల్లీ వెళ్లి అక్కడ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో భేటీ అవుతారని, ఆ తర్వాత మోదీని కలవాలని చిరంజీవి భావిస్తున్నాడట.అయితే మోదీ అపాయింట్మెంట్ చిరుకు దక్కుతుందా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
గత కొంతకాలంగా చిరంజీవి బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.కానీ ఆ విషయాన్ని చిరు తరుపున కొంతమంది ఖండించారు.

అయితే చిరును ను బిజెపిలో చర్చే బాధ్యతను గంటా శ్రీనివాసరావు తీసుకున్నారని, ఆయన కనుక బిజెపి లోకి వస్తే ఏపీ సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి.ప్రస్తుతం చిరు ప్రధాని ని కలిసేందుకు ప్రయత్నించడం దీనిలో భాగమేనా అనే సందేహాలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.కానీ ఈ విషయాన్ని చిరంజీవి సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు.కేవలం సైరా సినిమాను చూడాల్సిందిగా ప్రధాని ని కోరేందుకు ఢిల్లీ వెళుతున్నారని చెప్పుకొస్తున్నారు.అయితే దీని వెనక ఉన్న రాజకీయం ఏంటి అన్నది మాత్రం ఎవరికి స్పష్టంగా తెలియడం లేదు.