కాంగ్రెస్ " బీసీ మంత్రం ".. మాస్టర్ ప్లాన్ ?

ప్రస్తుతం టి కాంగ్రెస్( Telangana congress ) మంధి దూకుడు మీద ఉంది.వరుస బహిరంగ సభలు, పర్యటనలు నిర్వహిస్తూ తెలంగాణ ప్రజల దృష్టి కాంగ్రెస్ పై పడేలా చూసుకుంటున్నారు హస్తం నేతలు.

 Has Congress Made A Master Plan, Telangana Congress, Revanth Reddy , Ts Politics-TeluguStop.com

ముఖ్యంగా కర్నాటక ఎన్నికల్లో లభించిన విజయం టి కాంగ్రెస్ నేతలకు సరికొత్త బుస్టప్ ఇచ్చిందనే చెప్పాలి.ఆ విజయం ఇచ్చిన జోష్ అలాగే కొనసాగలంటే.

తెలంగాణలో కూడా కర్నాటక తరహా వ్యూహరచన అమలు చేస్తేనే మంచిదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందట.కర్నాటకలో సామాజిక వర్గాల వారికి ప్రజలను ఆకర్షించడంలో కాంగ్రెస్ సక్సస్ అయింది.

Telugu Brs, Congress, Manikrao Thakre, Rahul Gandhi, Revanth Reddy, Telangana, T

ఆ రాష్ట్రంలో అధిక శాతం ఉన్న లింగాయత్, ఒక్కలింగ, వంటి వర్గాల వారికి అధిక సీట్లు కేటాయించి వారి ఓటు బ్యాంకు అంతా కూడా కాంగ్రెస్ వైపు తిరిగేలా చూసుకున్నారు హస్తం నేతలు.ఇప్పుడు అదే తరహాలోనే తెలంగాణలో కూడా కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని వ్యూహరచన చేస్తోంది హస్తం పార్టీ.తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకు ఎక్కువ.ఏ పార్టీ అయిన గెలుపోటములను డిసైడ్ చేయడంలో ఈ వర్గం ప్రజల పాత్ర అధికంగా ఉంటుంది.తెలంగాణలో మొదటి నుంచి కూడా బీసీ సామాజిక వర్గం బి‌ఆర్‌ఎస్ వెంటే ఉంటోంది.దీనికి కారణం బీసీ సామాజిక వర్గాన్ని ఆకర్షించేలా కే‌సి‌ఆర్( CM KCR ) చేపడుతున్న విధానాలు, అలాగే కేబినెట్ లో కూడా బీసీ వర్గానికి చెందిన సభ్యులకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం వంటివి చేస్తున్నారు కే‌సి‌ఆర్.

Telugu Brs, Congress, Manikrao Thakre, Rahul Gandhi, Revanth Reddy, Telangana, T

అందుకే బీసీలు బి‌ఆర్‌ఎస్ కు అండగా నిలుస్తూ వచ్చారు.ఇప్పుడు ఆ బీసీలనే కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని చూస్తోంది హస్తం హైకమాండ్.సీట్ల కేటాయింపులో బీసీలకు 50 శాతం టికెట్లు కేటాయించే విధంగా వ్యూహరచన చేస్తోందట.అదే విధంగా బీసీ ప్రజలను ఆకర్షించే విధంగా మేనిఫెస్టో రూపకల్పన కూడా ఉండేయబోతుందట.

ఇటీవల జరిగిన పీఏసి సమావేశంలో టి కాంగ్రెస్ నేతలు దీనిపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.ఇక బీసీ రిజర్వేషన్ల పెంపు పై ( 40 శాతానికి పెంచుతామని ) కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్( Manikrao Thakre ) కీలక వ్యాఖ్యలు చేశారు.

దీన్ని బట్టి చూస్తే బీసీలపై కాంగ్రెస్ ఎంతలా ఫోకస్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.మరి కాంగ్రెస్ వళ్లిస్తున్నా ఈ బీసీ మంత్రం ఆ పార్టీకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube