చేప కళ్లలో ఉన్న పోషకాల గురించి తెలిస్తే అస్సలు వదలరు ..!

ముఖ్యంగా చెప్పాలంటే చేపలను తినాలంటే చాలామంది అసలు ఇష్టపడరు.కానీ కొంతమంది మాత్రమే చేపలను ఇష్టంగా తింటూ ఉంటారు.

 If You Know About The Nutrients In The Eyes Of The Fish, You Will Not Leave At A-TeluguStop.com

నిపుణుల అభిప్రాయం ప్రకారం చికెన్, మటన్ కంటే కూడా చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది.చేపలను క్లీన్ చేసే ప్రాసెస్ మీరు ఎప్పుడైనా చూశారా.

దాన్ని కట్ చేసి పైన పొట్టు తీసి జన పక్కన పెట్టి కళ్లు కూడా పీకేసి పారేస్తారు.ఇప్పుడు మనం ఆ కళ్ల గురించే మాట్లాడుకుందాం.

ఎందుకంటే మీరు వేస్ట్ అనుకొని పారేసే కళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.చేప కళ్లు( Fish eyes ) తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇది నాడీ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.

Telugu Collagen, Fish Eyes, Tips, Minerals, Proteins, Vitamins-Telugu Health Tip

కొన్ని వ్యాధులకు వైద్యులు చేపలని తినమని సలహా ఇస్తూ ఉంటారు.చేప కన్ను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చేపలను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

దాని కంటిలో అనేక రకాల పోషకాలు కూడా ఉన్నాయి.చేపల కళ్లలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ( Omega three fatty acids, proteins, vitamins, minerals )లాంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

అలాగే చేపలలో కొల్లాజెన్ ఉంటుంది.కొల్లాజెన్ ఒక రకమైన ప్రోటీన్.

ఇది చర్మం, కీళ్లు, జుట్టు, గోళ్ళకు చాలా ముఖ్యమైనది. కొల్లాజెన్( Collagen ) మన శరీరంలో ఉంటుంది.

కానీ వయస్సుతో తేమ స్థాయి తగ్గుతుంది.మనం చేపల కన్ను తినడం వల్ల కొల్లాజెన్ మన శరీరంలోకి కొంతవరకు చేరుతుంది.

Telugu Collagen, Fish Eyes, Tips, Minerals, Proteins, Vitamins-Telugu Health Tip

ఈ రోజుల్లో ప్రజలు మెదడు ఆరోగ్యం గురించి మర్చిపోతున్నారు.వివిధ రకాల పని ఒత్తిడి కారణంగా మెదడు పై ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది.దీని వల్ల జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది.వృద్ధులు పిల్లలతో సహా ప్రతి ఒక్కరిలో జ్ఞాపక శక్తి పెరగడానికి చేప కళ్లను తీసుకోవడం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు.

చేపలలో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ సాయంతో బలహీనమైన జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చు.చేపలు తినే ప్రతి ఒక్కరూ చేప కళ్లను తినలేరు.ఎందుకంటే అలర్జీ వంటి సమస్య వారిని వేధిస్తూ ఉంటుంది.చేపలు వండక ముందు వాటి కళ్లను సరిగ్గా శుభ్రం చేయకపోతే ఇతర సమస్యలు కూడా వస్తాయి.

అలర్జీ లేదా మరి ఇతర సమస్యలు లేని వారు మాత్రమే చేప కళ్లను తినవచ్చు.బలవంతంగా మాత్రం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube