టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కళ్యాణ్( Hero Pawan Kalyan ) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.ఈ నటుడు తొలిప్రేమ, తమ్ముడు, సుస్వాగతం, గోకులంలో సీత, ఖుషి వంటి హృదయాన్ని హత్తుకునే సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ హీరో అయిపోయాడు.
సినిమా పరంగా పవన్ ఇప్పటివరకు పెద్దగా వివాదాల్లో చిక్కుకోలేదు.అతడు గురించి నెగటివ్ గా కామెంట్స్ చేసిన వారు కూడా లేరు.
అయితే సినిమా వాళ్లు, పవన్ తో కలిసి పని చేసిన వాళ్ళు ఎవరూ ఇలాంటి కామెంట్స్ చేయకపోయినా, తాజాగా సినీ విశ్లేషకుడు దాసరి విజ్ఞాన్( Dasari Vignan ) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై దారుణమైన కామెంట్స్ చేశాడు.

ఈ సో కాల్డ్ సినీ అనలిస్టు మాట్లాడుతూ.“పొద్దున ఆరు గంటలకు షూటింగ్ ఉందంటే 6 గంటలకు ఆయన ( పవన్ కళ్యాణ్) రాడు.11 గంటలకు, అలా వస్తుంటాడు.ఆయనకు ఫోన్ చేసి పిలిచే ధైర్యం ఎవరికీ ఉండదు.ఆయన ఎప్పుడొస్తే అప్పుడే షూటింగ్ మొదలు పెట్టాలి.ఒక్కోసారి వస్తా.వస్తా.
అని చెప్పి చివరికి వేరే చోట ఉన్నాను, ఇవాళ కుదరదు లేండి, రేపు చేద్దామని అనేస్తాడు.అన్ స్టాపబుల్ షో( Unstoppable Show ) లో కూడా దర్శకులను ఇబ్బంది పెడతారా అని అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ న్యూట్రల్ గానే సమాధానం చెప్పాడు కానీ అవన్నీ కొట్టి పారేయలేదు.సెట్స్ కి టైమ్‌కి వస్తారా అని అడిగినప్పుడు కూడా సరైన సమాధానం చెప్పలేదు.” అని సంచలన కామెంట్స్ చేశాడు.

అయితే ఇందులో నిజం ఎంతో అబద్ధం ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు( Pawan Kalyan Fans ) మాత్రం సినీ విశ్లేషకుడు దాసరి విజ్ఞాన్‌ను ఏకిపారేస్తున్నారు.పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల బిజీగా ఉండి అప్పుడప్పుడు రాకపోవచ్చేమో కానీ మాట ఇస్తే ఆ సమయానికి వచ్చి షూటింగ్ జరుపుకొని పోతాడు అని మరి కొందరు అంటున్నారు.మొత్తం మీద పవన్ కళ్యాణ్ దర్శక నిర్మాతలతో వ్యవహరించే బిహేవియర్ పై ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి.ప్రస్తుతం పవన్ హరి హర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇటీవల తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమాలో నటించాడు అది రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రివ్యూస్ పొందింది.







