టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది.మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీ లో ఒక తన నటనతో ఒక ప్రత్యేక స్థానాన్ని,గుర్తింపు తెచ్చుకున్నాడు.
అంతేకాకుండా ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బన్నీ కి మలయాళం ఇండస్ట్రీ లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.అలాంటి బన్నీ పై కొంతమంది వ్యతిరేక ప్రచారం ఒకటి చేస్తున్నారు.
అయితే ఎవరు చేస్తున్నారు అన్న విషయం పై క్లారిటీ లేదు కానీ బన్నీ కి మాత్రం వ్యతిరేకంగా కొన్ని ప్లెక్సీ లు దర్శనమిస్తున్నాయి.ఒక స్టార్ హీరో కి వ్యతిరేకంగా ఇంత బహిర్గతంగా ప్లెక్సీ లు కట్టి దాన్ని వైరల్ చేయడం సంచలనంగా మారింది.

అందులో తెలుగు ఇండస్ట్రీకి అల్లు అర్జున్ అన్యాయం చేస్తున్నాడన్నట్లు రాసి పెట్టి ఉండడం తో పాటు తెలుగు సినిమా కార్మికలు సంఘం అంటూ ఫ్లెక్సీ ఉండటం గమనార్హం.ఆ ప్లెక్సీ లో ఉన్న విషయం ఏమిటంటే తెలుగు సినీ ప్రేక్షకులు ఇతనిని హీరోగా పోషిస్తున్నారు కానీ ఇతను మాత్రం కార్మికులు పొట్ట కొడుతున్నాడు ఎందుకని.? అంటూ ఆ ఫ్లెక్సీలో ప్రశ్నించారు.పోస్టర్ కింద తెలుగు సినీ కార్మికుల ఐక్యత వర్ధిలాల్లి అని అంటూ రాసి కూడా ఉంది.
దీనితో అసలు ఇండస్ట్రీ లో బన్నీ కి వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరో పక్క ఈ పోస్టర్స్ పై బన్నీ ఫ్యాన్స్ కూడా గుర్రు మంటున్నారు.
కావాలనే తమ హీరో గా టార్గెట్ చేసి ఇలాంటి తప్పుడు ప్లెక్సీ లు కట్టి ప్రచారం చేస్తున్నారు అని వారు మండిపడుతున్నారు.

ఇది నిజంగానే తెలుగు సినీ కార్మిక సంఘాలా పనా.లేదంటే వాళ్ల ముసుగులో ఇంకెవరైనా ఇలా చేసారా అనేది తెలియాల్సి ఉంది.ఎవరైనా తెలివిగా తెలుగు సినిమా కార్మికుల సంఘాన్ని ఇందులో ఇరికించి బన్నీకి, వాళ్లకి మధ్య ఎందుకు అగాధాన్ని సృష్టిస్తున్నారనేది కూడా సస్పెన్స్ గా మారింది.
మొత్తానికి ఇప్పుడు ఈ టాపిక్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.