వ్యభిచారానికి పేరుమోసిన ముంబై నగరంలో దారుణం చోటు చేసుకుంది.ఓ వ్యభిచారిణి తనను ఎక్కువ డబ్బులు అడిగిందనే నెపంతో ఓ విఠుడు ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసిన ఘటన కామాటిపురలో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.కేటరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తు్న్న ఓ వ్యక్తి ఈ నెల 13వ తేదీన కామాటిపురలోని ఓ వేశ్య వద్దకు వచ్చాడు.

ఆమెతో శారీరక సుఖం కోసం అతడు ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో బేరం ఆడాసాగాడు.అయితే ఆ వేశ్య అతడిని ఎక్కువ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిందని కోపంతో రగిలిపోయిన సదరు యువకుడు, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు.

ఏకంగా 30 కత్తిపోట్లతో ఆమెను తీవ్రంగా గాయపరిచాడు.దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటనలో నిందితుడైన యువకుడు అక్కడి నుండి పారిపోగా.పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకుని.కోర్టులో హాజరుపర్చనున్నారు.






