పెళ్లి వేడుకలో గొడవ,తలలు బద్దలు కొట్టుకున్న బంధువులు

పెళ్లి అంటే నే ఒక సంబరం, అలాంటి సంబరాల్లో ఆనందాలు ఉంటాయి కొన్ని కొన్ని సార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి.ఇదంతా పెళ్లిళ్ల సమయంలో కామన్.

 Wolverhamptonweddingfight Goesonviral-TeluguStop.com

అయితే గొడవలు జరగొచ్చు గానీ మరీ ఇంతలా రక్తాలు కారేలా కొట్టుకోవడం మాత్రం కొంచం అరుదనే చెప్పాలి.అయితే ఈ గొడవ మామూలు ఎదో చిన్న పెళ్లి మండపం లో జరిగింది అని అనుకుంటే పప్పులో కాలేసి నట్లే.

ఇంతకీ ఈ గొడవ ఎక్కడ జరిగింది అంటే ఇంగ్లాండ్ లో ఒక సంపన్నులు విచ్చేసే ఫైవ్ స్టార్ హోటల్ లో చోటుచేసుకోవడం ఆశ్చర్యకరం.ఇంగ్లాండ్‌లోని వోల్వర్హంప్టన్‌లో గల రామదా పార్క్ హాల్ హోటల్‌లో శనివారం రాత్రి పెళ్లి వేడుక జరిగింది.

అయితే ఈ వేడుక సందర్భంగా వచ్చిన అతిధులు అందరూ కూడా అక్కడ వస్తున్న సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు.అయితే ఈ మధ్యలో ఏమి జరిగిందో ఏమో గానీ సడన్ గా ఒకరి నొకరు కొట్టుకోవడం మొదలు పెట్టారు.

ఈ క్రమంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా తెగ కొట్టుకున్నారు.కొందరైతే అక్కడ ఉన్న కుర్చీలను తీసి మరీ దాడికి దిగడం తో కొందరి తలలు కూడా పగిలిపోయాయి.

వేదికలోని టేబుళ్లు, గ్లాసులు, బాటిళ్లు, అలంకరణ వస్తువులను ఏ ఒక్కటి కూడా వదలకుండా వారంతా ధ్వంసం చేశారు.ఈ గొడవ చూసి హోటల్ సిబ్బంది బయటకు పరుగులు తీయడం తో యాజమాన్యం మాత్రం ‘‘దయచేసి శాంతించండి.

హోటల్ బయట ఉన్న పోలీసులు ఉన్నారు.గొడవ ఆగకపోతే వారు మిమ్మల్ని అరెస్టు చేస్తారు’’ అనిహోటల్ యాజమాన్యం మైక్‌లో హెచ్చరించినప్పటికీ కూడా వారు శాంతించలేదు.

ఈ లోపు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Telugu Telugu Ups, Wolverhampton-

  ఈ క్రమంలో ఈ ఘటనలో గాయపడిన వారిని ప్రధమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.అయితే ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.అయినా ఏదైనా పెళ్లి అంటే గొడవలు రావొచ్చు గానీ మరి ఇంతలా రక్తాలు కారేలా కొట్టుకోవడం ఏంటి అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

అయితే పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు కుటుంబాల మధ్య మొదలైన చిన్న గొడవ ఇంత అనర్ధానికి దారితీసినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube